తెలంగాణ ఎక్కువా? బాహుబలి ఎక్కువా?

Update: 2017-04-30 11:00 GMT
తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఏకిపడేశారు. తాజాగా రిలీజైన బాహుబలి సినిమాపై వారు చూపుతున్న శ్రద్ధ రాష్ర్టంపై చూపడం లేదని ఆరోపించారు. బాహుబలి సినిమాపై ఉన్న శ్రద్ధ, ఆ చిత్రాన్ని చూడాలన్న ఉత్సుకత పాలనపైగానీ, పేదల సమస్యపైగానీ అటు కేసీఆర్ ప్రభుత్వం కాని, ఇటు అధికారులు కాని చూపడం లేదని పొన్నం మండిపడ్డారు.
    
బాహుబలి సినిమా టికెట్ల కోసం  ఉన్నతాధికారులు చూపిన శ్రద్ధలో పదోవంతు రైతుల బాగోగులపై చూపినా, ఆత్మహత్యలు లేని తెలంగాణ వచ్చుండేదని అన్నారు. సినిమా చూసి వచ్చి పొగడ్తలు కురిపిస్తున్న అమాత్యులు, అదే సమయంలో రోడ్డెక్కిన మిర్చి రైతుల సమస్యను విపక్షాలపైకి నెట్టి పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
    
ఖమ్మం రైతులపై కేసులు పెడితే, వారికి అండగా కాంగ్రెస్ నిలుస్తుందని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. బాహుబలి ఫీవర్ రెండు రాష్ర్టాలనూ కుదిపేస్తున్న తరుణంలో ఆ సినిమాతో ముడిపెట్టి కేసీఆర్ పై విమర్శలు చేయడంతో చాలాకాలంగా లైమ్ లైట్లో లేని పొన్నం ఒక్కసారిగా వార్తలకెక్కారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News