సామాజిక సమస్యలపై టాలీవుడ్ స్టార్స్ కొంత మంది నిత్యం స్పందిస్తూ వుంటుంటారు. వారి దృష్టికి ఏ సమస్య వచ్చినా దానిపై వాదిస్తూ బాదితులకు అండగా నిలుస్తున్నారు. ఇలా వ్యవహరిస్తున్న టాలీవుడ్ స్టార్ లలో ముందు వరుసలో నిలుస్తున్నారు హీరోయిన్ పూనమ్ కౌర్. గత కొంత కాలంగా సామాజిక సస్యలపై తన గళం వినిపిస్తున్నారామె.
గతంలో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపై వ్యగ్యంగా సెటైర్లు వేసి వార్తల్లో నిలిచిన పూనమ్ కౌర్ గత కొంత కాలంగా సామాజిక సమస్యలపై ట్విట్టర్ వేదిక స్పదిస్తున్నారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న అకృత్యాలపై, లైంగిక వేధింపులపై స్పందిస్తున్న పూనమ్ కౌర్ తాజాగా ఓ యువతి ఆత్మహత్య పై స్పందించారు. తమిళనాడులో పన్నెండవ తరగతి జదువుతున్న ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంపై పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించారు.
క్రైస్తవ మిషనరీలో చదివే లావణ్య అక్కడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు పూనమ్. బలవంతంగా మతాన్ని మార్పించాలని వేధిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ వేధింపులని తట్టుకోలేకే లావణ్య ప్రాణాలు తీసుకుందని, ఈ ఘటన చాలా మందికి ఓ గుణ పాఠం కావాలని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంలచనం సృష్టిస్తోంది.
ఈ సందర్భంగా మతమార్పిడులపై మహాత్మా గాంధీ వెల్లడించిన అభిప్రాయాన్ని పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అవసరాల కోసం సర్టిఫికెట్ లలో మతమార్పిడికి పూనుకుంటున్న ఈ నేపథ్యంలో మత మార్పిడులకు వ్యతిరేకంగా నిలబడిని లావణ్య ధైర్యానికి గర్విస్తున్నానని, లావణ్య త్యాగం అందరికి గుణపాఠం కావాలని ఈ సందర్భంగా పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మ హత్య చేసుకున్న లావణ్యకు సపోర్ట్ గా నిలుస్తూ నటి పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 నుంచి పూనమ్ సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. 2019లో ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆమె సినిమాలకు ప్రస్తుతం గ్యాప్ ఇచ్చారు.