పేద మహిళ బ్యాంక్ ఖాతాలో వేల కోట్లా?

Update: 2015-07-26 10:10 GMT
ఎవరి బ్యాంక్ అకౌట్ లో అయినా కేవలం 2 వేల రూపాయలు ఉన్నాయంకుందాం... కానీ సడన్ గా రూ. 9,99,999 జమ అయ్యాయని మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది! కాసేపు షాక్ అవుతారు, అనంతరం ఎవరి ఆలోచన మేరకు వారు ప్రవర్తిస్తారు. కానీ... అవి కొంతసేపటి తర్వాత మాయమైపోతే... ఆ బాద వర్ణానాతీయం అనే చెప్పాలి! అదే వేలకోట్లు వచ్చి అకౌంట్ లో చేరితే....

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాంపూర్ లో ఊర్మిళ అనే పేద మహిళ ఈమధ్య జన్ ధన్ యోజన్ పథకం కింద రూ. 2 వేలతో ఎస్.బి.ఐ. లో ఖాతా తెరిచింది! అయితే కొన్ని రోజుల కిందట ఆమె ఫోన్ కు రెండు మెసేజ్ లు వచ్చాయి! ఒకటి ఆమె ఖాతాలో రూ. 9,99,999 జమాయ్యాయని! రెండో మెసేజ్ తెరచి చూస్తే... రూ.9.7 లక్షలు డెబిట్ కావడం వల్ల రూ.2వేలు ఉన్నాయని ఉంది! ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి రావడం ఏంటి... అంతలోనే పోవడం ఏమిటి అని అర్ధం కాకపోవడంతో బ్యాంక్ కు వెళ్లింది!

అధికారులు ఈమె బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేస్టే అందులో సుమారు రూ.95 వేల కోట్ల మొత్తం ప్రత్యక్షమైంది! ఆనందం ఆశ్చర్యం కలిపి పొందిన ఊర్మిళకు ఒక్క సారిగా షాక్ తింది! చేసిన తప్పును సరిదిద్దుకునే క్రమంలో బ్యాం క్లర్క్ ఏవో కారణాలు చెప్పి ఆమెకు నచ్చ చెప్పి పెద్ద వివాదం తలెత్తకుండా తిరిగి రూ. 95వేల కోట్లను ఆమె ఖాతా నుంచి తీసేసాడు! విషయం తెలుసుకున్న ఊర్మిళ... విచారంగా ఇంటికి వెళ్లింది!
Tags:    

Similar News