ఆ మోడల్ ను గొంతు కోసి చంపేశారు. నగ్నంగా కనిపించింది. ఎందుకు చంపారు? ఎవరు చంపారన్నది తెలియదు. రేప్ చేశారా? అన్నది డౌటే. ఆమెనే గొంతుకోసుకుందో కూడా తెలియదు. సోదరుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వచ్చి చూడగా ఈ దారుణం వెలుగుచూసింది.
పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. లాహోర్ డిఫెన్స్ బి ప్రాంతంలోని తన నివాసంలో నగ్నంగా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం.. వృత్తిరీత్యా మోడల్ అయిన నయాబ్నదీమ్ (29)ను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు.
మోడల్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నదీమ్ మృతదేహాన్ని పరిశీలించారు.ఆమె గొంతు కోసి ఉన్నట్టు గుర్తించారు. ఆమె సవతి సోదరుడు మహ్మద్ అలీ నాసర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ కు ఇంకా వివాహం కాలేదు. తానొక్కతే ప్రత్యేక ఫ్లాట్లో నివాసం ఉంటోంది. నదీమ్ చనిపోవడానికి ముందు రోజు నాసిర్ తో సరదాగా బయటకు వెళ్లింది. ఐస్ క్రీమ్ తినడం కోసం ఇద్దరూ కలిసి గుల్బర్గ్ వెళ్లారు. ఆ తర్వాత నాసిర్, నదీమ్ ను తన ఇంటి వద్ద దింపేసి వెళ్లిపోయారు.
మరుసటి రోజు నాసిర్ తన అక్క నదీమ్ కు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దాంతో అతడు నేరుగా సోదరి ఫ్లాట్ కు వచ్చాడు. డోర్ కొట్టినా స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కిటీకి నుంచి చూశాడు. కిటికీ గ్రిల్స్ ను తొలగించి ఉండటాన్ని చూసి అనుమానించాడు. కిటీకీలోంచి లోపలికి వెళ్లాడు.
ఇంట్లోకి వెళగా నదీమ్ నగ్నంగా.. విగత జీవిగా పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. నదీమ్ శరీరంపై, మెడపై తీవ్రమైన గాయాలున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. నాసిర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.