కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు రెండు నెలలుకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో హోరెత్తిస్తున్నారు. ఇటీవల ఈ నిరసన హింసాత్మకంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలోనూ రైతులకు మద్దతు లభిస్తోంది.ఈ క్రమంలోనే రైతుల ఉద్యమానికి ఇప్పటికే ప్రముఖ సింగర్, నటి రాబిన్ రిహన్నా, స్వీడన్ పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థంబర్గ్ లు రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు. కేంద్రంలోని బీజేపీ తీరును తప్పుపట్టారు.
తాజాగా మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా సైతం రైతుల ఉద్యమంపై షాకింగ్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. రైతుల ఉద్యమం చేస్తున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని మియా ఖండించింది.‘స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్’ అనే ఫ్లకార్డు పట్టుకున్న రైతుల ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. 'ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన ఏముంది.. ఢిల్లీలో ఇంటర్నెట్ కట్ చేశారు' అంటూ హ్యాష్ ట్యాగ్ తో ప్రశ్నించింది.
రైతులను పెయిడ్ యాక్టర్స్ అన్న వ్యక్తులపై మియా మండిపడింది. రైతులకే తన మద్దతు అని ట్వీట్ చేసింది.అయితే మియాను బీజేపీ మద్దతు దారులు తిడుతుంటే మరికొందరు మాత్రం రైతులకు సపోర్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా మాత్రం రైతులకు మద్దతిచ్చిన వారిని తీవ్రవాదులుగా పేర్కొంటూ మండిపడ్డింది.