మళ్లీ బెడిసికొట్టింది: నెగటివ్ వచ్చిన పది రోజులకు మళ్లీ పాజిటివ్

Update: 2020-07-15 07:30 GMT
మహమ్మారి వైరస్ భారతదేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. కొత్తగా వేలల్లో కేసులు నమోదవుతుండగా వాటికి తోడు పాత కేసుల వారికి కూడా మళ్లీ వైరస్ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి వైరస్ వచ్చి కోలుకున్న వారికి తిరిగి వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా అలాంటి ఘటనలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. గతంలో హిమాచల్‌ప్రదేశ్, కేరళలో ఇలాంటి కేసులు నమోదవగా ఇప్పుడు పంజాబ్ లో వెలుగులోకి వచ్చాయి. ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న బాధితులు తిరిగి పాజిటివ్‌గా మారుతున్న ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

పంజాబ్‌ రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన ఐదుగురు బాధితులు చికిత్స పొంది కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జయ్యారు. ఆ తర్వాత పది రోజులకే వారు తిరిగి వైరస్ బారిన పడ్డారు. ఇది ఆ రాష్ట్రంలోని మొహాలిలో జరిగింది. అయితే వారికి వైరస్ సంబంధిత లక్షణాలు ఏవీ లేవు. అయినా పది రోజుల తరువాత వారు తిరిగి వైరస్ బారినపడడం కలకలం రేపుతోంది. దీనిపై వైద్యులు స్పందిస్తూ.. బాధితుడు వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తప్పనిసరిగా వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఒంటరిగా ఉండాల‌ని తెలిపారు. కోలుకున్న తర్వాత కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News