10 మంది పాక్ ఆటగాళ్ళకు పాజిటివ్ ..ఇంగ్లాండ్ టూర్ పై అనుమానం !

Update: 2020-06-24 14:00 GMT
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ‌పై వైరస్ పంజా విసురుతుంది. ముందుగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కి వైరస్ పాజిటివ్ గా నిర్దారణ కాగా, ఆ తర్వాత మరో ముగ్గురికి వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా మరో ఏడుగురికి పాజిటివ్ అని తేలింది. దాదాపు జట్టు సభ్యులంతా వైరస్ బారిన పడ్డారు.

నిన్న పాక్ క్రికెటర్లు హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్ ‌లకు వైరస్ పాజిటివ్ ‌గా తేలింది. ఇవాళ తాజాగా మరో ఏడుగురు పాక్ టీమ్ క్రికెటర్లకు కరోనా సోకినట్టు తెలిసింది. పఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశిప్ భట్టి, మొహ్మద్ హఫీజ్, మొహ్మద్ హుస్సేన్, మొహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్ లకు సైతం వైరస్ సోకినట్టు ధృవీకరించారు. మరో ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇందులో పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ జట్టు ప్రదాన కోచ్ వకార్ యూనుస్, ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెక్లాన్ ‌ల నివేదికలు ఉన్నాయి.

ఇకపోతే , ఇంగ్లాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ 29 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ పర్యటనకు పాక్ ఆటగాళ్లు జూన్ 28 న అంటే ఆదివారం లాహోర్ నుండి బయలుదేరవలసి ఉంది. అక్కడ వారు ఆగస్టులో 3 టెస్టులు మరియు ఒక టీ 20 మ్యాచ్ ఆడాలి. అయితే పీసీబీ ప్రకటించిన 29 మంది ఆటగాళ్లలో ఈ వైరస్ సోకిన 10 మంది కూడా ఉన్నారు.

దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ మాట్లాడుతూ... పాకిస్తాన్ ఇంగ్లాండ్ పర్యటన ఇప్పటికి కూడా ట్రాక్‌ లోనే ఉంది అని ,అయితే వారిలో పరీక్షల ముందు వరకు ఎటువంటి లక్షణాలను చూపించలేదని అన్నారు. అలాగే ఇంగ్లాండ్ పర్యటన తప్పకుండ జరుగుతుంది ఆ 10 మంది ఆటగాళ్ల స్థానంలో వేరే వారిని తీసుకుంటాము అని తెలిపారు.
Tags:    

Similar News