మోడీ..ఇద్ద‌రు చంద్రుళ్లు సుప్రీం మాట విన్నారా?

Update: 2018-07-21 05:11 GMT
అధికారం మత్తులో మునిగిపోయిన ప్ర‌భుత్వాల‌కు చెంప దెబ్బ త‌గిలేలా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం. అధికారాన్ని నిలుపుకోవ‌టానికి నిత్యం ప‌నికి మాలిన రాజ‌కీయాలు చేయ‌ట‌మే త‌ప్పించి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాల‌కులకు ప‌ట్ట‌ని వేళ‌.. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేసింది.

నిత్యం దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా.. ప‌ట్టించుకోని పాల‌కుల‌కు చుర్రుమ‌నేలా వ్యాఖ్యలు చేశారు. రోడ్ల‌పై గుంత‌లు ఉగ్ర‌వాదుల దాడుల క‌న్నా డేంజ‌ర్ గా మారాయ‌న్నారు.

దేశ వ్యాప్తంగా ర‌హ‌దారుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. రోడ్ల‌పై గుంత‌ల్ని స‌కాలంలో పూడ్చ‌ని కార‌ణంగా పెను ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని పేర్కొంది. ఈ కార‌ణంగా దేశ వ్యాప్తంగా వేలాదిగా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారు.. ఉగ్ర‌వాద దాడుల కంటే కూడా అత్య‌ధికంగా ఉంటున్న వైనాన్ని ప్ర‌స్తావించింది. ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న సుప్రీం.. రోడ్డు ప్ర‌మాదాల‌పై తీవ్ర ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఎన్నో గొప్ప ప‌నులు చేసిన‌ట్లుగా గ‌త రాత్రి పార్ల‌మెంటు సాక్షిగా చెప్పిన ప్ర‌ధాని మోడీ సుప్రీం వ్యాఖ్య‌ల్ని ఒక‌సారి వినాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌.. తెలుగు రాష్ట్రాల గురించి చూస్తే.. ఇద్ద‌రు చంద్రుళ్లు ఒక‌రికి మించి మ‌రొక‌రు త‌మ ప్ర‌భుత్వం గురించి.. తాము సాధించిన విజ‌యాల గురించి ఏక‌రువు పెట్టుకుంటారు.

కానీ.. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో గుంత‌లు లేని రోడ్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ సాధించ‌లేద‌ని.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికైనా సుప్రీం చేసిన వ్యాఖ్య‌ల్ని సీరియస్ గా తీసుకుంటే.. ప‌లువురు ప్రాణాల్నికాపాడిన వార‌వుతారు.




Tags:    

Similar News