ఏపీ రాజకీయాల్లో కమెడీయన్ లేని లోటుని తన శక్తివంచన లేకుండా పూడుస్తున్నకేఏ పాల్ కామెడీ ఇక మనకు కన్పించే అవకాశాలు లేవు. ఎందుకంటే భీమవరంలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. లేట్ గా వెళ్లడమే అసలు కారణం. నరసాపురం ఎంపీ స్థానానికి నామినేషన్ వేసి వచ్చే టైమ్ కు ఇక్కడ టైమ్ అయిపోయిందని మీడియా ముందు కన్నీళ్లపర్యంతమయ్యారు పాల్.
నిజంగా పాల్ కు నామినేషన్ వేసే చిత్తశుద్ధే ఉంటే శుక్రవారమే కంప్లీట్ చేసేవాడు. కానీ ఆయనకు హడావుడి కావాలి తప్ప మరింకేం వద్దు. అందుకే నామినేషన్ పత్రాల్లో సగానికి పైగా ఖాళీలు వదిలేసి ఇచ్చారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన. అంటే.. నామినేషన్లు పర్ ఫెక్ట్ గా ఇచ్చారా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని అన్నీ పరిశీలిస్తారు. ఏవైనా ఖాళీలు వదిలేసినా, మిస్టేక్స్ ఉన్నా నామినేషన్ కు తిరస్కరణకు గురవ్వడం ఖాయం. ఇప్పుడు నరసాపురంలో పాల్ నామినేషన్ మొత్తానికి వేశారు. అయితే అక్కడ కూడా సరిగ్గా నామినేషన్ పూర్తి చేయలేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో.. నరసాపురం ఎంపీ స్థానంలో కూడా పాల్ దాదాపుగా తప్పుకున్నట్లే అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇదంతా ఎన్నికల స్టంట్ అని, గత ఎన్నికల్లో లానే ఈసారి కూడా పాల్ కామెడీ చేసి తప్పుకుంటారని వార్తలు వస్తన్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. ఇంకొక్కరెండు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.