గతంలోలా పరిస్థితి లేదు. నోటి వెంట మాట జారితే చాలు.. క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. చిన్న మాటకు పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సిన వస్తున్న పరిస్థితి. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటమే కాదు.. వారిని చిన్నబుచ్చేలా ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డి వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దళితుల్ని ఈ మధ్య కాలంలో ఆయన చిన్నబుచ్చినట్లుగా మరే ఇతర నేత చేయలేదన్న మాట వినిపిస్తోంది.
దళితులు శుభ్రంగా ఉండరని.. వారికి అందిస్తున్న రిజర్వేషన్ల విషయంతో పాటు.. వారిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రి ఆది వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మంత్రి ఆది మాటలపై రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనమడు ప్రకాశ్ అంబేడ్కర్ స్పందించారు. దళితుల పట్ల ఇంత అనుచితంగా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. సారీ చెప్పాలంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆది మాటలపై స్పందించిన ఆయన.. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ఒక దళితుడని.. రాష్ట్రపతి ఒక దళితుడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. తాను త్వరలోనే గరగపర్రు దళితుల్ని కలుసుకోనున్నట్లు వెల్లడించారు.
దళితులు నిద్రపోతున్న సింహాలని.. వారిని రెచ్చగొడితే ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. దళితుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ మంత్రి హెచ్చరించిన అంబేడ్కర్ మనమడు.. దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. మొత్తానికి ఏపీ మంత్రి చేశారని చెబుతున్న అనుచిత వ్యాఖ్యలపై జాతీయ నేత.. అంబేడ్కర్ మనమడు స్వయంగా స్పందించటం టీడీపీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. మంత్రి ఆది మాటల పుణ్యమా అని బాబు సర్కారు దళిత వ్యతిరేక అన్న అభిప్రాయాన్ని కలిగించేలా ఉందన్న మాట వినిపిస్తోంది.