భారీ బజ్ తో విడుదలైన పాన్ ఇండియా మూవీ బన్నీ నటించిన ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. ఏపీ రాష్ట్రంలోని అరుదైన ఎర్రచందనం గురించిన చర్చను తీసుకురావటమే కాదు.. వాటిని అరికట్టటంలో రాష్ట్రం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని చెప్పేశాయి. ఎనభైల్లో జరిగినట్లుగా చూపించిన ఈ మూవీలో.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంత భారీగా సాగిందన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. ఇప్పటికి ఎంతలా విస్తరించిందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా చేస్తోంది.
మరి.. అలాంటి దారుణాల్ని చెక్ పెట్టేందుకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయి? అన్న విషయంలోకి వెళ్లినప్పుడు ఎవరూ పెద్దగా మాట్లాడరు. అధికార.. విపక్ష నేతలతో సహా అందరికి ఎర్రచందంనం స్మగ్లింగ్ తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉంటాయన్న ఆరోపణ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి వచ్చిన మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బెజవాడకు వచ్చిన తాను.. దారి మధ్యలో పుష్ప సినిమా పోస్టర్ చేశానని.. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు తాను కేంద్ర అటవీ పర్యావరణ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్సు ను వేసిందని చెప్పారు. అప్పట్లో ఉన్న ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఇప్పుడు లేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం విధ్వంసానికి ప్రాధాన్యమిస్తూ.. స్పెషల్ టాస్క్ ఫోర్సును రద్దు చేశారన్నారు.
అత్యంత విలువైన ఎర్రచందనం జాతి సంపద. అలాంటి సంపదను పరిరక్షించటానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. అందుకు భిన్నంగా వాటికి కల్పించిన రక్షణ వ్యవస్థలకు తూట్లు పొడిచేలా నిర్ణయాలు తీసుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ప్రకాశ్ జవదేకర్ మాటల్ని విన్నంతనే.. ఇదే అంశం గుర్తుకురాక మానదు.
ఏపీతో తనకున్న అనుబంధం గురించి చెప్పిన ఆయన.. ఇక్కడి ప్రజలన్నా.. వంటలన్నా తనకు ఎంతో ఇష్టమన్నారు. మొత్తానికి ఏపీ మీద అంత ప్రేమున్న ఆయన.. ఏపీకి మోడీ సర్కారు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి మాత్రం నోరు మెదపకపోవటం గమనార్హం.