అనుకోని విషాదం జరిగిన వేళ బాధ్యత కలిగిన మంత్రి ఎలా వ్యవహరించాలి? బాధితులకు భరోసా ఇవ్వటం.. వారిని ఓదార్చటం.. సహాయకచర్యలు చేపట్టటం లాంటివి చేయాలి. కుర్రాకారులో కనిపించే సెల్ఫీ పిచ్చ పట్టుకున్న సదరు మంత్రి తాను చేయాల్సిన పనిని వదిలేసి.. ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్పీ తీసుకోవటం ఇప్పుడుపెద్ద వివాదంగా మారింది.
బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెన ఒకటి మహారాష్ట్రలో కుప్పకూలిపోవటం.. రెండు బస్సులు నదిలో కొట్టుకుపోగా.. యాభై మంది గల్లంతయ్యారు. ప్రయాణికుల ఆచూకీ కోసం సహాయ సిబ్బంది ఇప్పటివరకూ 11 మృతదేహాల్ని వెలికి తీశారు. ఇదిలా ఉంటే.. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవీంద్ర ఫడ్నవీస్ సందర్శించారు. ఆయన వెంటనే.. విపక్ష నేతలతో పాటు.. మంత్రి ప్రకాశ్ మొహతా కూడా వచ్చారు.
ఈ సందర్భంగా మిగిలిన నేతలంతా జరిగిన దారుణం.. చేపట్టిన సహాయక చర్యలు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆరా తీస్తున్న వేళ.. గృహనిర్మాణ శాఖామంత్రి మెహతా మాత్రం సెల్ఫీలు తీసుకోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యత కలిగిన పదవిలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించి మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కోరి మరీ చిక్కుల్లో చిక్కుకోవటం అంటే ఇదేనేమో..?