నిత్యం కేంద్రంలోని మోడీ సర్కారును తిట్టిపోసే.. సినిమా నటుడు.. బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఒకవైపు.. కేంద్రంలో ఏం జరిగినా.. మోడీపై పన్నెత్తు మాట అనని హీరో మరోవైపు. ఆయనే పవన్ కళ్యాణ్. పైగా బీజేపీతో పొత్తులోనూ ఉన్నారు.
వీరిద్దరూ కూడా రాజకీయంగా ఉత్తర-దక్షిణ ద్రువాలుగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవడం.. చర్చించుకోవడం.. అన్నది ఆసక్తిగా మారింది. ఈ చర్చల్లో ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు..? అనే విషయాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి.
ఇంతకీ ఈ ఇద్దరు కూడా ఎక్కడ కలుసుకున్నారంటే.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రకాష్ రాజ్ సైతం హాజరయ్యారు. వీరిద్దరూ సెపరేట్‌గా కూర్చొని చాలా ఆత్మీయంగా మాట్లాడుకోవడం కెమెరా కళ్లను ఆకర్షించింది. రాజకీయంగా భిన్న ధృవాలైన వీరిద్దరూ అంత ఆత్మీయంగా చర్చించుకోవడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఏపీ రాజకీయాలను చూసుకుంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయితే.. వచ్చే 2024 నాటికి .. టీడీపీతో కలిసి మహాకూటమిగా ఏర్పడి.. పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చినట్టు లేవు. ఈ నేపథ్యంలో బీజేపీకి దూరమైనా సరే.. టీడీపీతోకలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్‌తో పవన్ భేటీ కీలకంగా మారిందని అంటున్నారు.
మరోవైపు.. మోడీని వ్యతిరేకించే తెలంగాణ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ప్రకాష్ రాజ్ సన్నిహి తంగా మెలుగుతున్నారు. కేసీఆర్ అనుకుంటే తప్ప ఆయన్ను కలవడం అసాధ్యం. కానీ ఈ ఏడాది ఆరంభంలో ప్రకాష్ రాజ్‌కు మాత్రం ఎప్పుడు అంటే అప్పుడు ఎంట్రీ లభించింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్‌లతో దాదాపుగా 4 గంటల పాటు చర్చలు జరిపారు.
కేసీఆర్ ముంబై పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ ఆయన పక్కనే ఉన్నారు. ఇది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టుగా.. వీరి దోస్తీ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి బద్ద శత్రువైన ప్రకాష్ రాజ్‌తో కలిసి నడుస్తున్నారు. అప్పట్లో ప్రకాష్ రాజ్‌ను రాజ్యసభకు పంపాలని సైతం ఫిక్స్ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ అది జరగలేదు.