కొద్దిరోజులుగా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యానాలు చేస్తూ విలక్షణ ప్రకాష్ రాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమర్ధుడైన కేసీఆర్ లాంటి నాయకుడు విజయం సాధిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఎన్నికలకు ముందు ఆయన కుండబద్దలు కొట్టారు. తాజాగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతుకోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
‘రాజకీయాల్లో అలాంటి వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొందరు అలా మాట్లాడుతూ ఉంటారు. జనాలు చూస్తారు కదా.. బండ్ల గణేష్ అలా మాట్లాడిన వీడియోకు ఎక్కువ మొత్తంలో హిట్స్ వచ్చాయి. జనాలు ఆయన్ను కామెడీగా చూశారు. ఫైనల్ గా వాళ్లే అధికారంలోకి ఎవరినీ తీసుకురావాలో డిసైడ్ చేశారు కదా’’ అని బండ్ల గణేష్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు.
ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి లాంటి వాళ్ల మాటలేంటి.? భాష ఏంటి? అటు కాకుండా.. ఇటు కాకుండా ఉన్న వారు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి’ అని మాట్లాడారని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని కించపరచడం కదా .. అలాంటి నాయకులు మనకు కావాలా అంటూ ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. తాను వీళ్లకు ఓటేయండి.. వాళ్లకు ఓటేయండి అని చెప్పలేదని.. ఆలోచించి రాష్ట్రం తరుఫున నిలబడే వారికి ఓటేయాలని కోరానని ప్రకాష్ రాజ్ తెలిపారు.
యువతలో భారీ మార్పులొచ్చాయని.. రాజకీయ నాయకులు ఫెయిల్ అయితే నిలదీస్తున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. మన రాష్ట్రానికి, దేశానికి కొత్త రాజకీయాలు అవసరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ , కర్ణాటక ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారని ప్రకాష్ రాజ్ అన్నారు.