అవసరం ఉన్నా.. లేకున్నా కొన్ని విషయాల్ని కెలుక్కొని మరీ తలనొప్పులు తెచ్చి పెట్టుకోవటం అధికారపక్షాలకు మామూలే. ఉన్న చిరాకులు సరిపోవన్నట్లుగా యూపీ సర్కారు చేసిన పనిపై ఇప్పుడు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా వ్యంగ్యస్త్రాల్ని సంధిస్తున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచి.. భారతదేశానికి ముఖచిత్రంగా ఉండే అతి కొద్ది కట్టడాల్లో ఒకటి తాజ్ మహాల్.
దీని పేరు ప్రఖ్యాతుల సంగతిని పక్కనపెడితే.. తాజ్ ఫోటో లేకుండా యూపీ సర్కారు టూరిజం బుక్ లెట్ ను విడుదల చేయటంతో దీనిపై రచ్చ మొదలైంది. ఇది అక్కడితో ఆగకుండా బీజేపీ నేతల మాటల కారణంగా అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇటీవల ఈ కట్టడాన్ని కూల్చేయాలంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించటం పలువురికి చిరాకు కలిగిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆదరణతో పాటు పేరు ప్రఖ్యాతలున్న కట్టటాన్ని కూల్చివేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతున్న బీజేపీ నేతల మాటలు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ను సైతం చిరాకుకి గురి చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా తన ట్వీట్ తో తాజ్ పై సాగుతున్న సంవాదంలో భాగస్వామిగా మారారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ కమలనాథులకు కరెంటు షాక్ కొట్టేలా ఉండటం గమనార్హం.
కమలనాథుల తీరును విమర్శించేలా ఆయన ట్వీట్ ఉందని చెప్పాలి. ఇంతకీ తన ట్వీట్ లో ప్రకాశ్ రాజ్ ఏం అన్నారంటే.. తాజ్ మహాల్ ను ఎప్పడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే.. తన పిల్లలకు చివరగా తాజ్ మహాల్ ను చూపిస్తానని ఎటకారం చేసేసుకున్నారు.
ఈ ట్వీట్ కు ముందు మరో ట్వీట్ లో ప్రకాశ్ రాజ్ తన తీరును స్పష్టం చేశారు. ప్రశ్నించటం కొనసాగిస్తానని.. అది తన ప్రాథమిక హక్కు అని.. తాను వ్యక్తపరిచే భావాల్ని వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్న ఆయన.. తనపై ఎవరైతే అదేపనిగా విమర్శిస్తారో.. వారు వాడే భాష అసహ్యం కలిగిస్తోందన్నారు. మొత్తంగా చూస్తే.. తనను తిట్టే వారి కారణంగా తాను మరింత దృఢమవుతానని చెప్పారు. మరి.. ప్రకాశ్ రాజ్ ఎటకారంపై కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.