భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రణబ్ ఈ అవార్డును అందుకున్నారు. దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను అందుకున్న సందర్భంగా ప్రణబ్ మోము నిజంగానే వెలిగిపోయిందని చెప్పాలి. రాజకీయాల్లో తల పండిన నేతగా - కేంద్ర మంత్రిగా - కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పలు కీలక పదవులు - బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన ప్రణబ్... ప్రధాని పదవిని మాత్రం అందుకోలేకపోయారు.
అయితే భారత ప్రథమ పౌరుడిగా కొనసాగే అవకాశాన్ని చేజిక్కించుకున్న ప్రణబ్... కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీజేపీ పాలన మొదలైనా... తనదైన మార్కు చూపించారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం బీజేపీపై విరుచుకుపడిన ప్రణబ్... బీజేపీ ప్రభుత్వం హయాంలోనే భారత రత్న అవార్డును ఎంపికై రికార్డు సృష్టించారు. ఇక ప్రణబ్ కు భారత రత్న అవార్డు ప్రదానం సందర్భంగా ఓ ఆసక్తికర అంశం ఉందని చెప్పాలి. తాను రాష్ట్రపతిగా ఉండగా... పలువురికి భారత రత్న అవార్డులను అందజేసిన ప్రణబ్... అవే చేతులతో ఇఫ్పుడు అదే అవార్డును అందుకోవడం నిజంగా ఆసక్తికరమే కదా.
సచిన్ - సీఎన్ ఆర్ రావు - అటల్ బిహరీ వాజ్ పేయి - మదన్ మోహన్ మాలవీయలకు ప్రకటించిన భారత రత్న అవార్డులను ప్రదానం చేసిన ప్రణబ్... ఇప్పుడు అదే అవార్డును అందుకున్నారు. తాను రాష్ట్రపతిగా ఉండగా తాను ఎక్కడైతే ఏ అవార్డును అయితే ఇతరులకు ప్రదానం చేశారో... ఇప్పుడు అక్కడే, అదే అవార్డును స్వీకరించారు. ఇదిలా ఉంటే... ప్రణబ్ తో పాటు నానాజీ దేశ్ ముఖ్ - భూపేన్ హజారికాలకు ప్రకటించిన భారత రత్న అవార్డులను రాష్ట్రపతి కోవింద్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.