సంఘ్ స‌భ‌కు ప్ర‌ణ‌బ్ వెళ్లాలి కానీ..అలా చేయాల‌ట‌

Update: 2018-05-31 09:28 GMT
గ‌డిచిన కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విప‌రీత‌మైన క‌ల‌క‌లాన్ని రేపుతోన్న అంశాల్లో సంఘ్ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాని.. గ‌తంలో సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ణ‌బ్ దా వెళ్లనున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం. సంఘ్ ప‌రివార్ ను మిగిలిన రాజ‌కీయ పార్టీలు ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌క‌పోవ‌ట‌మేకాదు.. ఆ సంస్థ ప‌ట్ల పార్టీలో అదో తీరులో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం తెలిసిందే.

అలాంటి స్వ‌యం సేవ‌క సంఘ్ స‌మావేశానికి మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ వెళ్ల‌టం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. సెక్యుల‌ర్ ట్యాగ్ లైన్లు వేసుకున్న పార్టీలు తీవ్ర ఆస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. కొంద‌రైతే ఒక అడుగు ముందుకు వేసి.. ప్ర‌ణ‌బ్ ను సంఘ్ స‌మావేశానికి హాజ‌రు కాకూడ‌ద‌ని కోరుతున్నాయి.

ఇలాంటి వేళ‌.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన త‌మిళ తంబి చిదంబ‌రం మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు. ప్ర‌ణ‌బ్ దా ఆర్ ఎస్ ఎస్ స‌మావేశానికి వెళ్లాల‌న్న మాట‌ను చెప్పిన చిదంబ‌రం.. త‌న మాట‌ను పూర్తిగా వినాల‌ని కోరుతున్నారు.

సంఘ్ ఆహ్వానాన్ని ప్ర‌ణ‌బ్ ఒప్పుకున్నారా?  లేదా?  అన్న‌ది పెద్ద విష‌యంకాద‌ని.. ఇప్పుడు అన్నింటి కంటే పెద్ద విష‌యం ప్ర‌ణ‌బ్ అక్క‌డికి వెళ్ల‌టం కంటే కూడా.. అక్క‌డి వేదిక మీద స‌ద‌రు సంస్థ చేసే త‌ప్పుల గురించి ప్ర‌స్తావించాల్సిన అవస‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డుతున్నారు. స‌ర్.. మీరు అక్క‌డికి వెళ్లండి.. వారి భావ‌జాలంలో ఏయే త‌ప్పులు ఉన్నాయో వారికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌న్నారు.

ఇదిలా ఉంటే.. చిదంబ‌రం మాట‌ల‌కు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ నేత ర‌మేష్ చెన్నితాల మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ నిర్ణయం త‌మ‌కు ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌న్నారు. అయితే.. ఆర్ ఎస్ ఎస్ లాంటి జాతీయ భావాలు క‌లిగి ఉన్న సంస్థ‌తో కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు స‌న్నిహితంగాఉన్న‌ట్లు చెబుతున్నారు. అలాంటి జాబితాను చూస్తే.. నెహ్రు.. ఇందిరాగాంధీ. లాంటి వారు హాజ‌రు అయ్యార‌ని.. మోడీ లాంటోళ్లు స‌మావేశానికి వెళ్ల‌టం త‌ప్పేం కాద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు.

Tags:    

Similar News