దేశ వ్యాప్తంగా కలకలం రేపిన మిర్యాలగూడ `పరువు` హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అమృత తండ్రి ...ఈ కేసులో ప్రధాన నిందితుడని...బిహార్ కు చెందిన సుభాష్ శర్మ....ప్రణయ్ ను హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ప్రెస్ మీట్ లో పట్టుబడిన హంతకులను కూడా మీడియాకు చూపించారు. అయితే, ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి లేవనెత్తిన అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. హంతకుడిగా చెబుతున్న సుభాష్ వేలిముద్రలు....ఘటనాస్థలంలో దొరికిన వేలి ముద్రలు మ్యాచ్ చేయాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి..ఓ కొత్త పాయింట్ లేవనెత్తారు. ఈ విషయాన్ని ఎస్పీ ప్రస్తావించలేదని బాలస్వామి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ వేలిముద్రలు మ్యాచ్ కాకుంటే కేసు మరో మలుపు తిరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
మారుతీరావు డబ్బు - పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి.....ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కొడుకును హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడితేనే ...అతడి ఆత్మ శాంతిస్తుందని - అపుడే అమృత - తాము సంతోషిస్తామని అన్నారు. ఉరిశిక్ష పడితేనే మారుతీరావు లాగా మరెవ్వరూ హత్యలు చేయించరని అన్నారు. మారుతీరావుకు.. శర్మలకు ఉరిశిక్ష పడేలా ప్రజాసంఘాలు.. పార్టీలు.. పోలీసులు ప్రయత్నించాలని అన్నారు. ఈ రోజు ప్రణయ్ ను చంపినవారు...భవిష్యత్తులో తమను చంపే అవకాశముందని అన్నారు. ఈ హంతుకులు - నిందితులు బయటకు వస్తే అమృతను కిడ్నాప్ చేసి తమ నుంచి దూరం చేస్తారని అన్నారు. నిందితులపై తక్షణమే పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మరి, పోలీసులు ....బాలస్వామి అనుమానాన్ని నివృత్తి చేస్తారో లేదో వేచి చూడాలి.