కెనడా దేశంలో ఓ తెలుగు యువకుడు నైట్రోజన్ గ్యాస్ పీల్చి మరీ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే... ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్ లేఖ రాసి చనిపోయాడు. అనంతపురంకు చెందిన యువకుడు ప్రణయ్ పుచ్చకాయల కొంతకాలంగా కెనడాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న కారణంతో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి కూడా కెనడాలోనే ఉంటోంది.
ప్రియురాలు ఇక తనకు దక్కదన్నమానసిక వేదనను తట్టుకోలేక ప్రణయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలని తన తల్లిదండ్రులకు లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.
తన ప్రియురాలు తనకంటే ముందు మరో ఆరుగురిని మోసం చేసిందని.. తాను ప్రేమ పేరుతో మోసపోయానని చనిపోయే ముందు ప్రణయ్ వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
కాగా తన కుమారుడి మృతిపై చాలా అనుమానాలున్నాయని.. ప్రణయ్ తండ్రి నారాయణ స్వామి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రేమ పేరుతో తన కొడుకును ఆ అమ్మాయి మోసం చేసిందని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పెళ్లి ఇప్పుడే వద్దంటూ మాయ చేసిందని.. ఆ అమ్మాయిపై ఆమె తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యువతి కుటుంబంపై తాను న్యాయపోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు.