ఇండస్ట్రీయలిస్ట్ గా పీవీపీ అందరికి సుపరిచితం. వ్యాపారవేత్తగానే కాకుండా ఊపిరి, బ్రహ్మోత్సవం సినిమాలతో నిర్మాతగా కూడా మారారు పీవీపీ. అయితే.. పీవీపీకి ఎన్ని వ్యాపకాలున్నా.. ఆయనకు మాత్రం రాజకీయాలంటే అమితమైన ఆసక్తి. 2014 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పొట్లూరి చాలా కష్టపడ్డారు. తన మిత్రుడైన పవన్ కల్యాణ్ తో కూడా చెప్పించారు. అప్పటికే పవన్ కు, పీవీపీకి ఆర్థికంగా కొన్ని లావాదేవీలున్నాయి. దీంతో పీవీపీ కోసం పవన్ గట్టిగానే కష్టపడ్డారు కానీ... ఆ సీటు అప్పటికే కేశినేని నానికి ఖరారైంది. దీంతో.. పవన్ చెప్పినా కూడా పీవీపీకి టిక్కెట్ రాలేదు. ఆ తర్వాత పీవీపీతో ఉన్న ఆర్థిక లావాదేవీల్ని పవన్ క్లియర్ చేసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సంబంధాలు కూడా బాగా తగ్గిపోయాయి.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్ మొదలైంది. దీంతో.. ఎప్పటినుంచో విజయవాడ ఎంపీ స్థానంపై కన్నేసిన పీవీపీ.. ఈసారి వైసీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే జగన్‌తో మంతనాలు కూడా పూర్తయ్యాయని త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 14న గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కొత్త ఇల్లు గృహప్రవేశం ఉంది. దీంతో.. అదే రోజు పీవీపీ కూడా పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఏదిఏమైనా విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందాలనేది పీవీపీ జీవితాశయంలా కన్పిస్తుంది.
Full View