తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల కంటే కూడా ప్రభావవంతమైన వ్యక్తిగా నిలుస్తారు రాజకీయ వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. ఆ మధ్యన కాంగ్రెస్ లో చేరుతానంటూ హడావుడి చేసిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉండాలని డిసైడ్ కావటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే..
తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ పార్టీ కారణంగా తన ట్రాక్ రికార్డు ఖరాబైందన్నారు. అందుకే ఆ పార్టీతో పని చేసేది లేదన్నారు.
బిహార్ లోని దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఇంటి నుంచి తన జన్ సూరజ్ యాత్రను ప్రారంభించిన ఆయన వివిధ పార్టీలతో తాను కలిసి పని చేసిన విధానాన్ని.. ఆ పార్టీలను తాను గెలిపించిన వైనాన్ని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ గురించి చెబుతూ.. తాను ఆ పార్టీతో కలిసి పని చేయటం ద్వారా.. తన ట్రాక్ రికార్డు పాడైందని పేర్కొనటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ తాను మునుగుతూ.. ఇతరుల్ని సైతం ముంచే పార్టీగా అభివర్ణించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మెరుగయ్యే పరిస్థితుల్లో కనిపించటం లేదన్న ఆయన.. ‘ఇప్పుడా పార్టీకి తన సొంతంగా తాను మెరుగయ్యే పరిస్థితి లేదు. ఆ పార్టీ అంటే గౌరవం ఉంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేయలేం’ అని తేల్చేశారు. తాను వివిధ పార్టీలతో జత కట్టి గెలిచామని కానీ కాంగ్రెస్ తో మాత్రం ఓడిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ కారణంగా తాను వ్యూహకర్తగా కూడా ఓడినట్లు చెప్పారు.
2015లో మహాకూటమితో బిహార్ లో గెలిచామని. 2017లో పంజాబ్ లో.. 2019లో జగన్ తో కలిసి ఏపీలో గెలిచామని గుర్తు చేశారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తో పని చేయగా.. 2021లో తమిళనాడు.. పశ్చిమ బెంగాల్ లో గెలిచామని.. 2017లో మాత్రం కాంగ్రెస్ తో కలిసి పని చేసి మాత్రం ఓడిపోయిన వైనాన్ని గుర్తు చేశారు. తన కెరీర్ లో కాంగ్రెస్ తో తప్పించి మరే పార్టీతో పని చేసినా గెలిచిన వైనాన్ని పీకే ప్రస్తావించటం గమనార్హం.