మార్చి నుంచి పీకే మార్చ్... ?

Update: 2022-02-20 13:30 GMT
పీకే అంటే ఎవరో అని కన్ఫ్యూజ్ అవుతారు. అవును ఏపీ వరకూ చూస్తే ఇద్దేరు పీకేలు ఉన్నారు. ఒక పీకే జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే రెండవ పీకే రాజకీయ  వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ పీకే ఇపుడు దేశమంతా తిరిగి యాంటీ బీజేపీ క్యాంప్ ని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. చిత్రమేంటి అంటే నేతల మధ్య విభేదాలు ఉన్నా పీకే మాత్రం అందరితో కలుస్తూ తాను అందరి వాడు అనిపించేసుకుంటున్నాడు.

ఇక పీకే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీయార్, జగన్ లకు సన్నిహితుడుగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పీకే వ్యూహాలతో ముందుకు సాగాలని టీయారెస్ లో పెద్ద ఎత్తున  చర్చ సాగుతోంది. ఇక ఏపీలో అయితే 2017 నుంచే పీకే వ్యూహాలతో వైసీపీ తన రాజకీయాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇదే తీరున 2024 ఎన్నికల్లో కూడా పీకే సలహా సూచనల మేరకు అడుగులు వేయాలని వైసీపీ భావిస్తోంది.

ఆ మధ్యన జగన్ మంత్రివర్గ సమావేశంలో పీకే టీమ్ యాక్టివిటీస్ త్వరలో ఏపీలో  స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఆ సమయం ఇపుడు వస్తోంది అంటున్నారు. మార్చి నెల నుంచి ఏపీలో వైసీపీకి పీకే టీమ్ పనిచేయనుంది అంటున్నారు. పీకే టీమ్ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పరిస్థితులను ఎప్పటికపుడు అధినాయకత్వానికి తెలియచేయడం ద్వారా వారిని అలెర్ట్ చేయనుంది. అలాగే ప్రభుత్వ పనితీరు మీద ఎప్పటికపుడు ఫీడ్ బ్యాక్ ఇస్తుంది.

ఇక ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు గురించి కూడా సర్వేలు చేస్తుంది. ఇలా పీకే టీమ్ పూర్తిగా రంగంలోకి దిగడం ద్వారా వైసీపీకి అసలు వాస్తవాలు ఏంటి అన్నది తెలియచేస్తుంది అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మార్చి నుంచి పీకే టీమ్ ఏపీలో మార్చ్ చేస్తుందనే అనాలి.

ఇక ఏపీలో అనేక కార్యక్రమాలను ఈ ఏడాది నుంచే స్టార్ట్ చేయడానికి వైసీపీ పెద్దలు చూస్తున్నారు. అదే విధంగా కీలకమైన అనేక నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారు. మరి వాటికి సంబంధించి ఫీడ్ బ్యాక్ రావాలీ అంటే పీకే టీమ్ గ్రౌండ్ లెవెల్ లో ఉండాల్సిందే అంటున్నారు.

మొత్తానికి పీకే టీర్మ్ వర్క్ స్టార్ట్ చేయబోతోంది అన్న న్యూస్ అయితే వైసీపీలో కొంత టెన్షన్ పెట్టేదిలాగానే ఉంది అంటున్నారు. ముఖ్యంగా  ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు మీద పీకే టీమ్ సర్వే చేసి ఇచ్చే రిపోర్ట్స్ గురించే ఆ టెన్షన్ అంతా అంటున్నారు. చూడాలి మరి పీకే టీమ్ ఏం చేయనుందో.
Tags:    

Similar News