చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ సక్సెస్ అయింది అని అధినాయకత్వం ఆనందంతో ఉంది కానీ అదే టైం లో పార్టీలో వర్గ పోరు మాత్రం తారస్థాయికి చేరుకుంది. ప్రతీ నియోజకవర్గంలో సీట్లు ఆశించే వారు పెరిగిపోతున్నారు.
చంద్రబాబు రాజాం టూర్ పెట్టుకుంటే అక్కడ రెండు వర్గాలు ఎదురయ్యాయి. బాబు కాన్వాయి సాగుతూండంగానే ఎచ్చెర్ల సీటు విషయంలో పోటీ పడుతున్న కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు వర్గాలు పోటీ పడుతూ ముందుకు సాగాయి.
ఇక రాజాం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటే కొంత దూరం ఆయనను అనుసరించి వచ్చిన మాజీ స్పీకర్ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ ప్రతిభాభారతి మధ్యలోనే కాన్వాయ్ దిగి వెళ్ళిపోయారు అని ప్రచారం సాగుతోంది. రాజాం టికెట్ విషయంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు తమకు అన్యాయం చేసి కాంగ్రెస్ నుంచి వచ్చిన కోండ్రు మురళీమోహనరావుకు ఇచ్చారని మాజీ స్పీఅకర్ వర్గం గుర్రుగా ఉంది.
అయితే 2024 ఎన్నికల వేళ కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది అని భావిస్తున్నారుట. ఇక రాజాం రోడ్ షోలో చంద్రబాబు కోండ్రు మురళీ మోహానరావుకే అధిక ప్రయారిటీ ఇవ్వడంతో అలిగిన ప్రతిభాభారతి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయారు అని ప్రచారం సాగుతోంది. రాజాం లో అయితే మాజీ స్పీకర్ వర్సెస్ కోండ్రు అన్నట్లుగా సీన్ ఉంది అని చెబుతున్నారు.
చంద్రబాబు టూర్ లోనే ఏకంగా ఒక నాయకుడి ఫ్లెక్సీలను మరో నాయకుడు అనుచరులు చించేయడం జరిగింది. ఈ గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఆఖరుకు పంచాయతీ స్థాయి దాకా గ్రూపులుగా విడిపోయారు. చంద్రబాబు రోడ్ షో హిట్ అయింది అని ఆనందంతో ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో రాజాం టికెట్ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
ఇక ఆ మధ్యన రాజాం టూర్ కి వచ్చిన చినబాబు లోకేష్ అయితే గ్రీష్మను పనిచేసుకోమని చెప్పారని ఆమె వర్గం అంటోంది. చంద్రబాబు చూపు అయితే కోండ్రు మురళీ మోహన్ వైపే ఉంది అని అంటున్నారు. ఇలా రాజాం విషయంలో పార్టీలో విభేదాలు తారస్థాయిలో ఉండడంతో బాబు కూడా ఏమీ చేయలేపోయారు అని అంటున్నారు.
కేవలం రాజాం మాత్రమే కాదు, ఎచ్చెర్ల, ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, గజపతినగరం, పార్వతీపురం వంటి చోట్ల తెలుగుదేశంలో రెండు వర్గాలు బలంగా ఉంటూ టికెట్ల కోసం పోరు సాగిస్తున్నారు. పార్టీ పరంగా చూస్తే జనాల మొగ్గు బాగానే ఉంది. కానీ వచ్చే ఎన్నికలు కీలకం, అందరినీ కలుపుకుని పోతేనే తప్ప విజయం సాధ్యం కాదు, మరి తమ్ముళ్ళు చూస్తే తమకే టికెట్ అంటూ వీధిన పడుతున్నారు. చంద్రబాబు ముందు దీన్ని సెట్ చేయాల్సి ఉంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.