ప్రముఖుల ఇంటి పేరుతో ఉన్న వారికి ఒక సౌలభ్యం ఉంటుంది. సదరు వ్యక్తులు కానీ మంచి మాటకారులతై.. సదరు ప్రముఖుడు తమకు బంధువు అంటూ బడాయి కబుర్లు చెప్పేస్తుంటారు. అదే మోసకారి అయిన వ్యక్తి అయితే.. అమాయకులు అతడికి బలి కావాల్సిందే. తాజాగా అలాంటి పరిస్థితే విజయవాడలో చోటు చేసుకుంది. మంత్రి పత్తిపాటి పుల్లరావు ఇంటి పేరున్న ఒక వ్యక్తి తాను మంత్రి బంధువునని చెప్పుకోవటమే కాదు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయక నిరుద్యోగులకు వల విసిరాడు.
అతడి మాటలు నమ్మిన పలువురు ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశతో లక్షల రూపాయిలు అతడికిచ్చారు. అలా ఇచ్చిన మొత్తం దాదాపు రూ.50 లక్షలు కావటం గమనార్హం. ఈ మోసం బయట పడి విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాను మంత్రి పత్తిపాటికి బంధువునని.. ఆయన తనకు చాలా క్లోజ్ అంటూ పత్తిపాటి సతీష్ అనే వ్యక్తి నిరుద్యోగ యువకుల నుంచి రూ.50లక్షల మొత్తాన్ని కలెక్ట్ చేశాడు. అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న అతగాడు అదును చూసుకొని మాయమయ్యాడు. అతడు చేసిన మోసాన్ని గుర్తించిన నిరుద్యోగ యువకులు ఇప్పుడు లబోదిబో మంటూ నున్న పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎంత మంత్రి బంధువులు అయితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇట్టే ఇప్పించేయగలరా?