ముంబైలో కుంభవృష్టి.. అతలాకుతలం

Update: 2020-08-07 02:30 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. భారీ వర్షాలతో ముంబై నీట మునిగింది. దీంతో నడుం లోతు నీటితో ముంబై చిగురుటాకులా వణుకుతోంది. జనజీవనం స్తంభించింది. ముంబైలో వర్షం బీభత్సం వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గేట్ వే ఆఫ్ ఇండియా ఉన్న దక్షిణ ముంబైలోని కొలాబాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 46 సంవత్సరాల్లోనే ఆగస్టులో ఒక్కరోజులో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం అంటున్నారు. కొలాబాలో 24 గంటల్లో 33.18 సెంటీమీటర్లు (331.8 మిల్లీమీటర్లు) వర్షం కురిసింది.

గడిచిన 5 రోజుల్లోనే ముంబైలో అత్యధిక వర్షం కురిసింది. ఇప్పటికే కరోనాను కంట్రోల్ చేయలేకపోయిన ముంబైకి వానలు నరకం చూపిస్తున్నాయి. ప్రభుత్వం అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలను మూసివేసింది.

ఇక రానున్న 24 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రజలను బయటకు రావద్దని కోరారు. ఇక ముంబై మునిగిపోవడంతో అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
Tags:    

Similar News