ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరుగుతున్నాయి. మరోవైపు జూలై 4న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు.
బీజేపీ తక్కువ స్థానాల్లో గెలిచినా.. ప్రభుత్వాలను పడగొట్టి ఎనిమిది రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిందని నారాయణ విమర్శిస్తున్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ హైదరాబాద్ వస్తున్నారని, ఆయన తీరును బీజేపీ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాలలో ఇలా ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీ తనకు ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇష్టం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని నారాయణ అంటున్నారు.
మోడీ హయాంలో 25 మంది రూ.25 లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రూ.40 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. నరేంద్ర మోడీ ఆ మొత్తాన్ని రూ.85 లక్షల కోట్లకు తీసుకెళ్లారని నారాయణ ఎద్దేవా చేస్తున్నారు. వీటన్నింటినీ బీజేపీ ఆమోదిస్తుందా అని ప్రశ్నించారు.
గతంలో ఏ ప్రధానమంత్రి మేకప్ కోసం నెలకు రూ.70 లక్షలు ఖర్చుచేయలేదని నారాయణ అంటున్నారు. ఇప్పుడు ఇలా మేకప్ కోసం నెలకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. ఓవైపు నరేంద్ర మోడీ తనను తాను సన్యాసిగా పేర్కొంటున్నారని.. మరోవైపు విలాసాలు, అలంకరణలకు రూ.లక్షలు లక్షలు ఖర్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో నంబర్‌వన్ క్రిమినల్ కేంద్ర హోం శాఖ అమిత్ షాయేనని అని నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.