సమాచారహక్కు చట్టం పుణ్యమాని బయటకు వస్తున్న సమాచారం ఎన్నో అంశాల మీద స్పష్టత ఇవ్వటమే కాదు.. ఊహాగానాలకు చెక్ పెట్టేలా ఉందని చెప్పొచ్చు. అధికారిక సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఉన్న ఈ చట్టంతో తాజాగా ప్రధాని మోడీ టీం సభ్యులకు అందే జీతాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసే సిబ్బందికి ప్రతి నెలా అందే జీతాల వివరాల్ని తెలియజేయాలంటూ కోరిన ఒక సహ చట్టం దరఖాస్తుదారుడి పుణ్యమా అని మోడీ ఇలాకాలో పని చేసే అధికారుల జీతాలు బయటకు వచ్చాయి. ప్రధాని మోడీకి కార్యదర్శిగా పని చేసే భాస్కర్ కుల్బేకు అందరి కంటే ఎక్కువగా జీతం అందుకున్నట్లుగా తేలింది. ఈ ఏడాది జూన్ ఒకటిన ఇచ్చిన జీతం రూ.2.01లక్షలుగా తేలింది. సీనియర్ ఐఏఎస్ అధికారికంగా వ్యవహరిస్తున్న ఆయన జీతమే కాదు.. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాల నెలసరి జీతాలు బయటకు వచ్చాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సీనియర్ ఐటీ మేనేజర్ స్థాయి కంటే తక్కువగా ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసే అధికారుల జీతాలు ఉండటం గమనార్హం. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాల నెలసరి జీతం రూ.1.65లక్షలు. ఈ ముగ్గురు అధికారులు రిటైర్డ్ అధికారులు కావటంతో వీరికి.. ఫించన్ కూడా అందుతోందని పేర్కొన్నారు.
వీరే కాక మరో ఆరుగురుజాయింట్ సెక్రటరీల జీతం రూ.1.55 లక్షల నుంచి రూ.1.77 లక్షల వరకూ ఉంది. వీరితో పాటు మరికొందరు మోడీ అధికారుల జీతాలు ఒక మోస్తరుగానే ఉండటం గమనార్హం. మోడీ ప్రైవేట్ సెక్రటరీలు రాజీవ్ తాప్నో కురూ.1.46లక్షలు.. సంజీవ్ కుమార్ సింగ్లా కు రూ.1.38లక్షలు వస్తుండగా.. సమాచారశాఖాధికారి శరత్చందర్ కు రూ.1.26లక్షలు.. ప్రధాని పీఆర్వో జేఎం థాకర్కు రూ.99వేల జీతం ఇస్తుండటం గమనార్హం. దేశంలోనే పవర్ సెంటర్ గా ఉండే ప్రధాని కార్యాలయంలో మోడీకి కీలకంగా వ్యవహరించే అధికారుల జీతాల.. ఐటీలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.