ప్ర‌ధాని నోట జ‌మిలి మాట‌.. జ‌గ‌న్ రెడీనా ?

Update: 2022-01-26 09:37 GMT
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రోసారి జ‌మిలి జ‌పం ప్రారంభించారు. తాజాగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న జ‌మిలి ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించారు. దేశంలో ఒకే సారి పార్ల‌మెంటుకు, అసెంబ్లీకి, పంచాయ‌తీల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఆదాయం.. అభివృద్ధి రెండూ అవుతాయ‌ని ఆయ‌న అన్నారు. నిజానికి గ‌డిచిన మూడు ద‌శాబ్దాలుగా దేశంలో ఈ మాట వినిపిస్తూనే ఉంది. అయితే.. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ మాత్రం ముందుకు సాగ‌డం లేదు. గ‌తంలో దివంగ‌త జ‌య‌ల‌లిత దీనిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

కేంద్రం అనుకూల‌త‌ల‌ను అంచ‌నా వేసుకుని ద‌దీనిని ముందుకు తెచ్చారంటూ.. ఆమె ఎదురు దాడి చేశారు. ఇక‌, త‌ర్వాత‌.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా జ‌మిలికి తాము వ్య‌తిరేకమ‌న్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి న‌రేంద్ర మోడీ నోటి నుంచి జ‌మిలి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. వాస్త‌వానికి ఆయ‌న ఏమైనా అనుకుంటే.. అన్నీ చేస్తున్నారు. మ‌రి జ‌మిలి విష‌యంలో మాత్రం ఆయ‌న అడుగులు వేయ‌లేక పోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఒక‌వేళ జ‌మిలి ఆలోచ‌న ఉండి ఉంటే.. వీటిని నిలిపి వేసి.. ఏడాది పాటు రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడితే.. 2023లో మొత్తంగా దేశ‌వ్యాప్తంగా అప్ప‌టికి పాల‌న‌ పూర్త‌య్యే రాష్ట్రాల‌తో క‌లిసి మొత్తంగా జ‌మిలి పెట్టే అవ‌కాశం ఉంటుంది. కానీ, దీనిని ప‌క్క‌న పెట్టి.. మోడీ మ‌రోసారి చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ్యూహంగానే భావిస్తున్నారు. ఇదిలావుంటే.. అస‌లు జ‌మిలి వ‌స్తే.. ఏపీలో జ‌గ‌న్ సిద్ధ‌మేనా? అనే చ‌ర్చ వ‌స్తోంది. వాస్త‌వానికి జ‌మిలికి ఏపీలో టీడీపీ అధినేత సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది నుంచి ఆయ‌న జ‌మిలి జ‌పం చేస్తున్నారు.

అయితే.. ఆయ‌న అధికారంలో లేరు క‌నుక ఈ మాట అంటున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌ను మాత్ర‌మే నమ్ముకున్న నేత‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. సో.. ఆయ‌న ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ధ‌మ‌నే మాట వినిపిస్తోంది. అయితే.. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన క‌ర్ణాట‌క త‌దిత‌ర రాష్ట్రాల‌ను ఒప్పించాల‌నేది వైసీపీ డిమాండ్‌. ఎందుకంటే.. ఆయా రాష్ట్రాల నుంచే ఇప్పుడు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సో.. మొత్తానికి జ‌గ‌న్ సిద్ధ‌మే అయినా.. జ‌మిలి మాత్రం సాధ్యం కాద‌ని.. వైసీపీ నేత‌లు అంటున్నారు.
Tags:    

Similar News