బ్రిటన్ రాజవంశం .. అత్యంత విలాసవంతమైన వారి జీవనవిధానం. కోటలను తలదన్నే భవంతులు .. వారు కదిలినా .. మెదిలీనా ప్రజలంతా అదో విశేషంగా చెప్పుకుంటారు. వారు కాలు బయటపెడితే చూడాలనుకుంటారు .. వారిని మానవులకు అతీతులుగా భావిస్తూ ఉంటారు. ఆ రాజరికం .. అద్దాల సౌధంలోని అందమైన జీవితాలను దగ్గర నుంచి నుంచి చూడటం అతి తక్కువమంది అధికారులు వలన మాత్రమే అవుతుంది. అందువల్లనే ఆ రాజరికం వెనుక దాగిన వ్యక్తిగత విషయాలను గురించి జనమంతా కథలు కథలుగా మాట్లాడుకుంటూ ఉంటారు .. ఆసక్తికరంగా చెప్పుకుంటూ ఉంటారు.
సాధ్యమైనంత వరకూ రాజరికానికి సంబంధించినవారి విషయాలు .. రహస్యాలు బయటికి రావు. ఎందుకంటే బయట నుంచి లోపలికి వెళ్లే అవకాశం ఎవరికీ ఉండదు గనుక .. లోపలికి వెళ్లే అతి తక్కువమంది కూడా అక్కడి విషయాలను బయటికి చెప్పే సాహసం చేయరు. అయినా బ్రిటన్ రాజు ఛార్లెస్ .. డయానా గురించి అంతా మాట్లాడుకోవడానికి కారణం వారి ధోరణి అని చెప్పవచ్చు. వారు తీసుకుని కొన్ని నిర్ణయాలు .. వ్యవహరించిన తీరు అందుకు కారణమనే చెప్పుకోవాలి. క్వీన్ ఎలిజబెత్ మరణించిన తరువాత ప్రిన్స్ ఛార్లెస్ బ్రిటన్ రాజుగా బాధ్యతలను చేపట్టారు.
దాంతో సహజంగానే ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలైంది. ప్రిన్స్ ఛార్లెస్ జీవితంలోని వివాదాలు .. ఆయన గురించి మరింత ఆసక్తిగా మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అంతగా ఆయన జీవితంలో వివాదాలు ఏమున్నాయని తొంగిచూస్తే, వెంటనే అపురూప సౌందర్యరాశి డయానా కనిపిస్తుంది. క్వీన్ ఎలిజబెత్ కి పెద్ద కొడుకుగా జన్మించిన ఛార్లెస్ చదువు పూర్తయిన తరువాత రాయల్ ఎయిర్ ఫోర్స్ లోను .. రాయల్ నేవీలోను పనిచేశారు. 1986లో డయానాతో ఆయన వివాహం జరిగింది. వారి సంతానమే ప్రిన్స్ విలియం .. ప్రిన్స్ హ్యారీ. కొంతకాలం పాటు సాఫీగానే సాగిన వారి వైవాహిక జీవితం ఆ తరువాత గాడి తప్పింది.
వివాహానికి ముందు కెమిల్లాతో ఉన్న అక్రమ సంబంధాన్ని ఆ తరువాత కూడా ఛార్లెస్ కొనసాగించడం డయానాకి తెలిసిపోయింది. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఛార్లెస్ ఒప్పుకున్నారు కూడా. ఈ కారణంగానే డయానాతో ఆయనకి విడాకులు జరిగిపోయాయి. ఆ తరువాత ఎవరికివారు తమదైన శైలిలో జీవించడం మొదలుపెట్టారు.
డోడి ఫాయెద్ తో ప్రేమలో పడిన డయానా అతనితో కలిసి ప్యారీస్ లోని రిట్జ్ హోటల్లో ఉండగా, మీడియావారు అక్కడికి చేరుకున్నారు. ఆ జంట బయటికి రాగానే కెమెరాలతో వెంటపడ్డారు. వారి కారును అనుసరించారు. వారి బారి నుంచి తప్పించుకునే క్రమంలో డయానా కారు ప్రమాదానికి గురికావడం .. ఆమె చనిపోవడం జరిగిపోయింది. ఈ సంఘటన కారణంగా కూడా ఛార్లెస్ నిందను ఎదుర్కోవలసి వచ్చింది.
డయానా బ్రతికి ఉండగా కెమిల్లాను పెళ్లి చేసుకోవడానికి చర్చి నుంచి ఛార్లెస్ కి అనుమతి లభించలేదు. డయానా మరణించిన తరువాత 2005లో కెమిల్లాను ఆయన వివాహం చేసుకున్నారు. ఇలా తన వ్యక్తిగత జీవితంలో వివాదాలను ఎదుర్కున్న ఛార్లెస్ .. పెద్ద వయసులో రాజుగా బాధ్యతలను స్వీకరించారు. అందుకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు. బ్రిటీష్ రాజవంశీకులలో అత్యధిక కాలం రాణిగా వెలిగిన గౌరవం క్వీన్ ఎలిజబెత్ కి దక్కగా, చాలా ఆలస్యంగా రాజుగా బాధ్యతలను తీసుకున్నవారి జాబితాలో ఛార్లెస్ ముందు నిలిచాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.