ప్రైవేట్ రూట్ : ఎయిరిండియా అనుబంధాలు తెగిపోతున్నాయి...

Update: 2022-07-27 23:30 GMT
కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా దూకుడు పెంచింది. ప్రైవేట్ బాటను ఎంచుకుంటోంది. ఇప్పటికే ఎయిరిండియాను ప్రైవేట్ పరం చేసిన కేంద్రం ఇపుడు అనుబంధ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది.

దీని కోసం చాలా చురుకుగా పరిశీలన జరుగుతోంది. ఎయిర్ ఇండియా అనుబంధాలైన అలయన్స్ ఎయిర్ ఏవియేషన్, ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ విక్రయానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది.

వీటి వల్ల భారీ ఎత్తున ఆదాయం కేంద్రానికి సమకూరుతుందని భావిస్తున్నారు. అదే టైమ్ లో ఆయా సంస్థలలో పెట్టిన పెట్టుబడులు కూడా రికవరీ అవుతాయని భావితోంది. దాంతో దీనికి సంబంధించి తెర వెనక కసరత్తు అంతా ముమ్మరంగా చేస్తోంది అని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే మరికొద్ది నెలలలో వీటికి బిడ్లను ఆహ్వానించాలని కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూడు కీలక సంస్థలలో  ఏ వన్  ఇంజనీరింగ్ సేవల కోసం పెద్ద ఎత్తున బిడ్డర్లు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టాటా గ్రూపు వీటిని కొనొగోలు చేయడానికి ఆసక్తిని చూపుతోందని అంటున్నారు. మరో వైపు టాటా గ్రూపు తో కలసి భారీ ఇంజనీరింగ్ సంస్థలు కలిగి ఉన్న ఇతర సంస్థలు మెయింటెనెన్స్ షాపులను నిర్వహిస్తాయని చెబుతున్నారు.

ఇకా అలయెన్స్ ఎయిర్ ఏవియేషన్ విషయానికి వస్తే ఏకంగా 19 టర్బోప్రాప్‌ల విమానాలతో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దేశంలో ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో యాభై దాకా దేశీయ గమ్య స్థానాలకు  రోజు వారీ డిస్పాచ్ లను నిర్వహిస్తోంది. దీనిలో 800 మంది ఉద్యోగులు ఉన్నారు.

మొత్తానికి చూస్తే మూడు అనుబంధ సంస్థలు కూడా ప్రైవేట్ పరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తమ సొంతం చేసుకునేందుకు బడా సంస్థలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ప్రైవేటీకరణ కూడా పూర్తి అయితే ఎయిర్ ఇండియా లో టోటల్ గా ప్రభుత్వం నుంచి అంతా చేజారినట్లే అంటున్నారు.
Tags:    

Similar News