ఉరీ ఉగ్రదాడి ముందు వరకూ ఒక లెక్క - సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఒక లెక్క! అవును.. భారత్ - పాక్ ల మధ్య సంబంధాలు ఉరీ ఉగ్రదాడి వరకూ కాస్త అటూ ఇటూగా ఉండటం - మోడీ సైతం నవాజ్ షరీఫ్ ఇంటికెళ్లి టీ తాగి రావడం జరిగింది. అయితే పాముకు పాలుపోసినా విషయమే కక్కుతుందని మరోసారి రుజువుచేసే ప్రయత్నంలో భాగంగా కుక్కతోక వంకర వంటి పని చేసిన పాక్ ఉరీ ఉగ్రదాడి ఘటనతో ఇండియా - పాక్ ల మధ్య సంబందాలు దాదాపు ముసినట్లే అనుకోవాలి. ఈ క్రమంలో రోఈజు రోజుకీ ఇండియా - పాక్ మధ్య శత్రుత్వం మరింత బలపడుతుంది. ఆసంగతి అలా ఉంటే... ఇండియా నుంచి పాక్ విడిపోయినప్పుడు ప్రాంతం విడిపోయిందే తప్ప ఆ సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు మాత్రం విడిపోలేదు. విభజన జరిగిన తర్వాత కూడా సరిహద్దు ప్రజలు రెండు దేశాల్లోనూ బంధుత్వాలను కలుపుకున్నారు. అయితే తాజా ఉద్రిక్త పరిస్తితులు ఇలాంటి రెండు కుటుంబాల పాలిట శాపంగా మారాయి.
పాకిస్థాన్ లోని సింధు ప్రావిన్స్ కు చెందిన ప్రియా బచానీకి - రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన నరేష్ తెక్వానికి కొద్దిరోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకకు నవంబర్ 8న ముహూర్తం సేట్ చేశారు పెద్దలు. అయితే తాజాగా ఉరీ ఉగ్రదాడి - అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్ తో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. ఈ ప్రభావం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటపై పడింది. ప్రస్తుతం కరాచీలో ఉంటున్న ప్రియా కుటుంబంతో - ప్రియాతోపాటు 15మంది కుటుంబ సభ్యులు ఈ వివాహం కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేందుకు మూడు నెలల క్రితం వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటివరకూ వారికి వీసా ఆఫీసు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పటికే వరుడి ఇంట్లో పెళ్లికి సంబంధించి 80శాతం ఏర్పాట్లు పూర్తవగా పెళ్లిని వాయిదా వేసుకునే యోచనలో ప్రియా కుటుంబం ఉందట. ఇదే సమయంలో కాబోయే భార్యకు ఇంకా వీసా రాకపోవడంతో నరేష్ కు దిగులు పట్టుకుందట. కాగ, 1999లో కూడా అప్పటి ఉద్రిక్తతల వల్ల అప్పట్లో ఇదే కుటుంబానికి సంబందించి జరగాల్సిన ఒక పెళ్లిని దాదాపు రెండేళ్లు వాయిదా వేసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/