జుక‌ర్‌ బ‌ర్గ్‌ కే షాకిచ్చిన ప్రియా వారియ‌ర్

Update: 2018-02-22 04:57 GMT
ఒక్క క‌న్ను కొట్టి కోట్లాది అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఒరు ఆదార్ లవ్’ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ సంపాందించుకుంది. రోజురోజుకి ఈ అమ్మ‌డిని ఫాలో అయ్యే వారి సంఖ్య మ‌రింత పెరుగుతూ వ‌స్తుంది. అయితే అదే స‌మ‌యంలో ఆమెను కోర్టు కేసులు సైతం ఇబ్బందుల పాలు చేశాయి. అయితే ఆమె ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది.

ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే స‌న్నీలియోన్‌ - క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ని క్రాస్ చేసిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌ బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌ బ‌ర్గ్‌ ని మించిపోయింది. ఆయ‌నికి ఇన్‌ స్టాగ్రామ్‌ లో 4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేర‌ళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏదైన ఫోటో పోస్ట్‌ చేసిన లేదంటే వీడియో అప్‌ లోడ్ చేసిన మిలియ‌న్స్‌ కి పైగా లైకులు - వ్యూస్ వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగా మారిన ప్రియా రోజురోజుకి ఎవ‌రికి అంత‌నంత ఎత్తుకి ఎదుగుతుంది. ఈ అమ్మ‌డికి ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్స్ కూడా క్యూ క‌డుతున్నాయి. టాలీవుడ్‌ లో నిఖిల్ స‌ర‌స‌న నటించే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తుండ‌గా , దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

కాగా, ‘ఒరు ఆధార్ లవ్’ ఫేం నటి ప్రియావారియర్ - దర్శకుడు ఒమర్ లులూపై నమోదైన కేసులపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని హీరోయిన్ ప్రియావారియర్ స్వాగతించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ లులూ మాట్లాడుతూ కోర్టు నిర్ణయం మాకు పెద్ద ఉపశమనంలాంటిదని అన్నాడు. సినిమాలోని పాట వైరల్ అయ్యాక యూనిట్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుందని..అయితే దీనికి వ్యతిరేకంగా నమోదైన కేసుల నుంచి ఉపశమనం దొరకడం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో నటించినవారంతా యువనటీనటులేనని లులూ అన్నాడు. ఒరు ఆధార్ లవ్ సినిమా షూటింగ్ 20 శాతం మాత్రమే పూర్తయింది. చిన్న రోల్‌ లో నటించిన ప్రియావారియర్‌ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలో ఐదుగురు హీరోహీరోయిన్లున్నారు. అయితే ప్రియావారియర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని క్లెమాక్స్ సీన్స్‌కు సంబంధించి స్క్రిప్ట్‌ లో మార్పులు చేస్తున్నామని ఒమర్ లులూ తెలిపాడు. చిత్రయూనిట్ తరపు లాయర్ మాట్లాడుతూ దర్శకులకు అంతా మంచే జరుగుతుందనడానికి కోర్టు నిర్ణయమే నిదర్శనమన్నారు. తమపై క్రిమినల్ కేసులు నమోదవకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రియావారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News