ఆపరేషన్ ఏపీ చేపట్టిన బీజేపీకి ఇప్పుడు వలసలే ప్రధాన అవసరంగా మారాయి. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఒడిసిపట్టుకోవాలిన బీజేపీ చూస్తోంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీని లేకుండా చేసి 2024వరకు దాని స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఇక తెలుగుదేశం పార్టీకి బోలెడంతా సినీ గ్లామర్ ఉంది. ఆ పార్టీ పుట్టుకలోనే ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి వచ్చారు. చంద్రబాబు వెంట టాలీవుడ్ లోని ప్రముఖులు, హీరోలు ఉన్నారు. ఇక మొన్నటి ఎన్నికల వేళ టాలీవుడ్ లోని ప్రముఖులు అలీ, ఫృథ్వీ, పోసాని, జీవితా రాజశేఖర్ సహా చాలా మంది వైసీపీకి సపోర్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి సినీ గ్లామరే లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. కృష్ణం రాజు , సీనియర్ నరేష్ లు బీజేపీలో ఉన్నా వారివల్ల పెద్దగా ప్రయోజనం దక్కడం లేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో సినీ గ్లామర్ అద్దేందుకు బీజేపీ సీనియర్ హీరోయిన్ ను చేర్చుకుంటోంది.
తెలుగు - తమిళం - మలయాళం - కన్నడ - హిందీ భాషల్లో 50కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియారామన్ ను ఇప్పుడు బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వల్లి’తో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ నటించిన ‘మాఊరి మారాజు’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. దాదాపు 7 భాషలపై పట్టున్న ఈ ముద్దుగుమ్మను బీజేపీలో చేర్చుకొని ఏపీ రాజకీయాల్లో క్రియాశీలం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.