నేల‌రాలిన చ‌దువుల త‌ల్లి

Update: 2015-10-24 16:40 GMT
తెలంగాణ‌లో ఓ చ‌దువుల త‌ల్లి నేల‌రాలింది. ద‌స‌రా సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చిన తెలంగాణ‌కు చెందిన టాప‌ర్ విద్యార్థిని త‌న నివాసంలోనే ఉరివేసుకొని అసువులు బాసింది. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

వెంక‌టాపురం గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చీరాల ప్రియాంక కొత్తగూడెం కృష్ణవేణి జానియర్ కాలేజీలో చదువుతోంది. దసరా సెలవుల సంద‌ర్భంగా ఇంటికి వచ్చిన ప్రియాంక సెలవులు ముగిసి కాలేజీకి వెళ్లే స‌మ‌యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇంట్లో ఎవ‌రూ లేని సమ‌యంలో ఆమె చీర‌తో ఉరి వేసుకుంది. ఇది గ‌మ‌నించిన స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ అప్ప‌టికే ఆమె త‌నువు చాలించింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం విడుదలయిన పదో తరగతి ఫలితాల్లో ప్రియంక తెలంగాణ‌ టాపర్‌ గా నిలిచింది. చదువులో చురుగ్గా ఉండే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడటంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదువుల తల్లికి ఎం కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News