కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గాంధీయేతరుడ్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని రాహుల్ కోరుతున్నారు. ఈ అంశంలో తన సోదరిని కూడా వదిలేయాలని కోరారు. అయితే, దీనిపై కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ అధ్యక్షులైతే, కాంగ్రెస్ 24 గంటల్లో చీలడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వైపు మొగ్గుచూపుతున్నారు. కష్టకాలంలో ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు ఎంపీ అభిజిత్ ముఖర్జీ, సీనియర్ నేత అనిల్ శాస్త్రి ఇప్పటికే సూచించగా.. వారితో నట్వర్ సింగ్ గొంతు కలిపారు. పార్టీని నడిపే సత్తా ప్రియాంకకు ఉన్నదని - యూపీ ఘటన ద్వారా ఇది స్పష్టమైందన్నారు. పార్టీ కొత్త సారథి గాంధీ కుటుంబం నుంచి ఉండబోరన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకుంటే కాంగ్రెస్ చీలే ప్రమాదం ఉన్నదని నట్వర్ సింగ్ హెచ్చరించారు.
అయితే, ప్రియాంక దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని వస్తున్న విజ్ఞప్తులను ఆమె తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న పాత్ర అయిన పార్టీ ప్రధాన కార్యదర్శిగానే కొనసాగేందుకే సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలకు చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ... రాహుల్ స్థానంలో ప్రియాంక పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. ఇదిలాఉండగా, పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే విషయమై పార్టీ సీనియర్ నేతలు - కాంగ్రెస్ సీఎంలు - కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను సీల్డ్ కవర్లలో అధిష్ఠానానికి అందజేశారు. ఆ కవర్లలో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే - సుశీల్ కుమార్ షిండే - దిగ్విజయ్ సింగ్ - కుమారి సెల్జా - ముకుల్ వాస్నిక్ - సచిన్ పైలట్ - జ్యోతిరాదిత్య సింధియా పేర్లు ఉన్నట్లు సమాచారం. కొత్త అధినేత ఎంపికపై కసరత్తు తర్వాత కూడా సీనియర్ నేతలు ఏకాభిప్రాయానికి రాలేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాహుల్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు.