నానాటికీ చిక్కి శల్యమవుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు రావాలంటే... ప్రియాంకా గాందీ రావాల్సిందే. ఈ మాట చాలా కాలం నుంచే వింటున్నాం. ప్రియాంకా గాంధీ... గాంధీ ఫ్యామిలీ ఆడపడచే అయినా... రాబర్ట్ తో పెళ్లితో ప్రియాంకా వాద్రాగా మారిపోయారు. అయినా కూడా ఆమెకు గాంధీ వారసత్వ వాసనలు పోలేదు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికీ ప్రియాంకను గాంధీ ఫ్యామిలీ వారసురాలిగానే అంతా భావిస్తున్నారు. పార్టీ సంక్షోభంలో పడిపోయిన ప్రస్తుత తరుణంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీల మాదిరిగా పార్టీని నడిపించే వారు ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదు. రాహుల్ గాందీ పార్టీ పగ్గాలు చేపట్టినా... ఆయన అంతగా ఆకట్టుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రియాంక బరిలోకి దిగితేనే పార్టీకి పూర్వ వైభవం అన్న మాట వినిపిస్తోంది.
ఈ భావన నిజమేనన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కూడా చిన్నచిన్నగానే అయినా ప్రియాంక ఎంట్రీకి సంబంధించి కీలక నిర్ణయాలే తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం పార్టీ ప్రచార బాధ్యతలను ప్రియాంకకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం ప్రచారానికే పరిమితమవుతారా? లేదంటే... ఎన్నికల్లో పోటీకి దిగుతారా? అంటూ ప్రియాంకపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీ ఆదేశిస్తే ఈ సారే పోటీకి కూడా సిద్ధమేనని ప్రకటించిన ప్రియాంక సంచలనం రేకెత్తించారు. ప్రియాంక పోటీ ఖాయమేనన్న కోణంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా మరో సంచలన ప్రకటన చేశారు.
ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేసిన వాద్రా... అంతకుమించిన సంచలన ప్రకటన మరొకటి చేశారు. ఈ ఎన్నికల్లోనే పోటీకి దిగనున్న ప్రియాంక నేరుగా .ప్రధాని నరేంద్ర మోదీ బరిలోకి దిగుతున్న వారణాసి నుంచే పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన పెను కలకలమే రేపిందని చెప్పాలి. వారణాసి నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక సిధ్ధంగానే ఉన్నారని, అయితే పార్టీ అధిష్ఠానానికే తుది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ప్రియాంక పోటీకి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉన్నా... స్వయంగా ప్రియాంక భర్త నోట నుంచి ఈ తరహా ప్రకటన రావడంతో దేశ రాజకీయాల్లో ఈ విషయంపై పెద్ద చర్చకే తెర లేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే... వారణాసి నుంచి మరోమారు బరిలోకి దిగేందుకు మోదీ రంగం సిద్ధం చేసుకున్నారు.
గడచిన ఎన్నికల్లో రెండో చోట్ల నుంచి పోటీ చేసిన మోదీ... ఈ దఫా ఒకే చోట నుంచి బరిలోకి దిగుతున్నారు. అది కూడా తన సొంత రాష్ట్రం గుజరాత్ కాకుండా ఉత్తరప్రదేశ్ లోని వారణాసిని ఆయన ఎంచుకున్నారు. ప్రియాంక పోటీ గనుక ఖాయమే అయితే... మోదీకి ముచ్చెమటలు పట్టడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. సోనియాతో పాటు రాహుల్ గాందీ కూడా యూపీ నుంచే పోటీ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అచ్చుగుద్దినట్టు ఇందిరా గాంధీ పోలీకలతో ఉన్న ప్రియాంక బరిలోకి దిగితే మాత్రం మోదీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ మేర సంచలనాలకు కారణం కానున్న ప్రియాంక పోటీకి కాంగ్రెస్ అధిష్ఠానం ఏమంటుందో చూడాలి.