ప్రియాంక.. మోడీని ఢీ కొట్టబోతున్నారా?

Update: 2019-04-14 16:21 GMT
కాంగ్రెస్ పార్టీలు ఫుల్ యాక్టివ్ అయిన ప్రియాంక వాద్రా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగుతారా.. అనేది ఆసక్తిదాయకంగా మారింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్న రాహుల్ గాంధీ ఒక్కరే సరిపోరు అనే విషయాన్ని గ్రహించి..ప్రియాంక తను కూడా రంగంలోకి దిగారు. ఈ సారి ప్రియాంక ఛరిష్మా తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని కాంగ్రెస్ వాళ్లు విశ్వాసంతో ఉన్నారు.

వారి విశ్వాసానికి మరింత ఊపును ఇచ్చే దిశగా తన ప్రయత్నాలను సాగిస్తున్నట్టుగా ఉన్నారు ఈ కాంగ్రెస్ నేత. అదెలాగంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారట ప్రియాంక. ఈ సారి కూడా మోడీ వారణాసి నుంచి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో..ఆయన మీద తను పోటీ చేయడానికి ప్రియాంక రెడీ అంటున్నారట.

కార్యకర్తలతోనే ఆమె ఈ విషయాన్ని డైరెక్టుగా చెబుతూ ఉండటంతో… ఆమె మోడీతో ఢీ కొట్టడానికి సై అంటున్నారనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ విషయం గురించి కాంగ్రెస్ నేతల వద్ద ప్రస్తావిస్తే.. అవన్నీ పుకార్లే అని, పుకార్లను తాము నమ్మమని, ఒకవేళ ప్రియాంక గనుక  పోటీ చేస్తే ఆ విషయం గురించి అధికారిక ప్రకటన వస్తుందని..డొంక తిరుగుడుగా మాట్లాడుతూ ఉన్నారు. మోడీ మీద ప్రియాంక పోటీ చేస్తుందనీ వీరు అనడం లేదు, పోటీ చేయదని చెప్పడం లేదు!
Tags:    

Similar News