కొన్నిసార్లు అంతే. ఒక చర్యతో మొత్తం ఇమేజ్ మారిపోతుంది. దాదాపుగా అలాంటిదే తాజా ఉదంతంగా చెప్పాలి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తాజాగా స్పందించిన తీరు పలువురి మనసుల్లో ఆమెపై ప్రత్యేక అభిమానాన్ని పెంచేలా చేసిందని చెప్పాలి. ఆ మధ్యన ఎన్నికల ప్రచారంలో భాగంగా పాములు పట్టే వారి వద్దకు వెళ్లి.. వారి కష్టాల గురించి అడిగి తెలుసుకునే క్రమంలో ఆమె స్పందించిన తీరు.. పాముల్ని పట్టుకున్న విధానంపై పెద్ద చర్చే జరిగింది.
మీడియాలో కొత్త ఇమేజ్ కోసం తపిస్తున్నట్లు కాకుండా.. తన మానాన తాను ఉన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్న వైఖరి పట్ల ఇప్పుడు సానుకూలత వ్యక్తమవుతోంది. ఇలాంటివేళలోనే తన దృష్టికి వచ్చిన ఒక అత్యవసర వైద్యసాయం కోసం ఆమె స్పందించిన తీరు పలువురి అభినందనల్ని అందుకుంటోంది. యూపీలో ఒక చిన్నారికి అత్యవసరంగా వైద్యం అందాల్సిన నేపథ్యంలో ప్రియాంక క్షణాల్లో తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాదు.. పలువురి దృష్టిని ఆకర్షించింది.. ఆమె మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
ట్యూమర్ తో బాధ పడుతున్న తమ పాప వైద్యఖర్చుల్ని భరించే స్తోమత లేదని.. తమను ఆదుకోవాలంటూ యూపీకి చెందిన ఒక పేద తల్లిదండ్రులు ప్రియాంకను ఆశ్రయించారు. అంతే.. దీనికి స్పందించిన ప్రియాంక.. పార్టీ సీనియర్ నేతలు రాజీవ్ శుక్లా.. హార్దిక్ పటేల్.. మహ్మద్ అజారుద్దీన్లను సంప్రదించి.. మెరుగైన వైద్యం కోసం పాపను ఢిల్లీకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో.. వెనువెంటనే ప్రత్యేక విమానంలో పాపను.. వారి తల్లిదండ్రుల్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇక.. ఆసుపత్రి ఖర్చుకుసంబంధించిన అంశాలు తాను చూసుకుంటానని.. పాపకు అందించే వైద్య సేవల వివరాల్ని తాను మానిటర్ చేస్తానని ప్రియాంక చెప్పిన వైనంపై పలువురు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.