ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కొత్త అంశం ఏదైనా ఉందంటే... అది రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ రాజకీయాల్లో యాక్టివేట్ కావడమేనని చెప్పాలి. అచ్చుగుద్దినట్లు తన నానమ్మ ఇందిరా గాంధీని పోలికలతో ఉన్న ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ కోసం కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ మద్దతుదారులు కూడా చాలా కాలం నుంచే ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలోనే జనాల్లోకి వస్తున్న ప్రియాంక... సోదరుడు రాహుల్ గాంధీ - తల్లి సోనియా గాంధీల నియోజకవర్గాలు అమేధీ - రాయబరేరీల్లో మాత్రం ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ దఫా ఎన్నికలను అత్యంత ప్రాదాన్యం కలిగిన ఎన్నికలుగా పరిగణించిన రాహుల్... సోదరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చేవారు.
అన్న ఆదేశించడమే తరువాయి... కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలను చేపట్టడంతో పాటుగా ఉత్తరప్రదేశ్ తూర్పు భాగం బాధ్యతలను కూడా భుజాన వేసుకున్న ప్రియాంక... ప్రచారంలో తనదైన శైలిని చూపుతున్నారు. విపక్షాలపై తనదైన శైలి సెటైర్లు వేయడంతో పాటుగా విపక్షాలకు మద్దతుదారులుగా ఉంటున్న వారి వద్దకు వెళుతై...ప్రియాంక కొత్త తరహా ప్రచార పంథాను అమలు చేస్తున్నారు. ఇక నానమ్మ ఇందిర మాదిరిగానే జనాలతో మమేకం అయ్యేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రియాంక... నానమ్మ మాదిరే ప్రజల వద్దకెళ్లేందుకు ఏకంగా బారీకేడ్లను కూడా దూకేస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రియాంక... రట్లాంలో జరిగిన బహిరంగ సభలో తనను చూసి కేరింతలు కొట్టిన ప్రజల వద్ద కెళ్లి కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు.
ఈ క్రమంలో ఆమె తన సెక్యూరిటీని కూడా లెక్కచేయకుండా బారీకేడ్లను ఎక్కి దూకేసి జనాలతో కరచాలనం చేశారు. గతంలో ఇందిర కూడా ఇలాగే జనంతో మమేకమయ్యేవారు. ఇప్పుడు ప్రియాంక కూడా బారీకేడ్లను దాటుకుని జనాలతో కలిసిపోతున్న దృశ్యాలను జనం మదిలో ఇందిరను గుర్తు చేస్తున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే... తన ప్రచారంలో భాగంగా ఓ ప్రాంతానికి వెళుతున్న ప్రియాంక కాన్వాయ్ ని చూసిన బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోదీ నినాదాలతో హోరెత్తించారు. ఇంకొకరైతే చిర్రెత్తపోయేవారేమో గానీ.. ప్రియాంక మాత్రం తన కాన్వాయ్ ని ఆపి బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారి వద్దకెళ్లి కరచాలనం చేసి వారిని షాక్ కు గురి చేశారు. మొత్తంగా ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.