ఆఫ్ఘన్ శరణార్థుల తరలింపులో సమస్య .. ఆ సిండ్రోమ్‌తో అమెరికా భయం

Update: 2021-08-26 23:30 GMT
గత కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైంది. దాంతో అక్కడి నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండటంతో భారీగా ప్రజలు కాబుల్ విమానాశ్రయ సమీపంలో గుమిగూడుతున్నారు. ఆగస్టు 31 లోపు దేశం నుండి నిష్క్రమించే ప్రక్రియను పూర్తి చేయాల్సిన సమయంలో కాబూల్ విమానాశ్రయానికి దూరంగా ఉండాలని సూచనలు వచ్చాయి. ఆగస్టు 15 న తాలిబన్లు రాజధానిని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పశ్చిమ బలగాలు కాబూల్ విమానాశ్రయం నుండి 80,000 మందికి పైగా ప్రజలను బయటకు తీశాయి. విమానాశ్రయంలో జరిగిన గందరగోళంలో ఎనిమిది మంది మరణించారు.

తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వియత్నాం పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సిండ్రోమ్‌ కారణంగానే కొన్ని గంటలపాటు కమలా హరిస్ వియత్నాం పర్యటన ఆలస్యమైంది. వియత్నాంలోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది. అయితే విమాన ప్రయాణాలు జరుగుతున్నప్పుడు పీడించే ఈ సమస్యను హవానా సిండ్రోమ్‌ అని అంటారు. 2016లో తొలిసారి దీనిని క్యూబాలో హవానా నగరంలోని అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో ఈ సమస్యను అక్కడి అధికారులు గుర్తించారు. తొలిసారి హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు.

ఈ హవానా సిండ్రోమ్‌ లో ముందుగా మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఆ తర్వాత కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్లు చప్పుడు వినిపిస్తుంటుంది. ఈ శబ్దం భరించలేని స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం, వాంతులు చేసుకుంటారు. అంతేకాదు, విపరీతంగా అలసటతో పాటు.. ఏ విషయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోలేరు. క్యూబాలో ఈ ప్రభావానికి లోనైన వారిలో మూడోవంతు మందికి అధికారులకు వినికిడి శక్తి పాక్షికంగా దెబ్బతిందని వారు వెల్లడించారు. వారి మెదడును స్కాన్‌ చేసిన అమెరికా వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ హవానా సిండ్రోమ్‌ బారిన పడిన వారి మెదడు కొద్దిబాగం దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సాధారణంగా ఏదైనా భారీ ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదని అంటున్నారు. కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్‌ బారిన పడుతున్నారు.

గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మైక్రోవేవ్‌ తరంగాల సాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్‌, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్‌ బాధితుల జాబితాలో ఉన్నారు. కొందరు కెనడా దౌత్యవేత్తలు కూడా ఈ సిండ్రోమ్‌ బారినపడినట్లు సమాచారం. 2019లో కారులో ఉన్న ఒక అమెరికా సైనిక అధికారికి ఒక్కసారిగా తీవ్ర వికారంగా అనిపించింది. అదే సమయంలో వెనుకసీటులో ఉన్న అతడి రెండేళ్ల కుమారుడు కూడా విపరీతంగా ఏడవటం మొదలు పెట్టాడు. వారు కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆ లక్షణాలు తగ్గాయి.

అఫ్గానిస్తానీయులను తరలించే పనిని భూజాలపై ఎత్తున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారు కమలా హారిస్. ఇందులో భాగంగా వియత్నాం పర్యటనకు వెళ్లిన సమయంలో కమలా వెంట ఉన్న అధికారులపై హవానా సిండ్రోమ్‌ ప్రభావం కనిపించింది. దీంతో ఆమె ప్రయాణం కొన్ని గంటలపాటు ఆలస్యంగా సాగింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది హవానా సిండ్రోమ్‌ వంటి సమస్య బారిన పడినట్లు తేలింది. ఈ సారి దౌత్య సిబ్బంది ఇంటి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఇక్కడి సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన అమెరికా సిబ్బంది కమలా పర్యటన ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.


Tags:    

Similar News