తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ‘కొత్త’ ఉత్సాహం పొంగిపొర్లుతోంది. కొత్త జిల్లాల ఏర్పాట్లు వాయువేగంతో జరుగుతున్నాయి. ఏది ఏమైనా దసరా రోజు నుంచి పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ 27 జిల్లాలుగా మారేలా అధికారయంత్రాంగం పని చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది కేవలం సాంకేతికంగా మాత్రమే మారనుంది. మరి.. కొత్త మార్పు రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరి జీవితాల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త కొత్త సమస్యలు తలెత్తనున్నాయి.
ఇప్పటివరకూ అడ్రస్ రాసే ప్రతిఒక్కరూ చివర్లో జిల్లా పేర్లు రాయాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలతో ఏళ్ల తరబడి అలవాటును ఒక్కసారిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం మర్చిపోయినా ఇబ్బందే. ఇదొక్కటే కాదు.. ఎవరికి వారు కనిపించకుండా తమకు తాము ఒక చట్రంలో బతుకుబండి లాగిస్తుంటారు. ఊరును యూనిట్ గా చూసినప్పుడు.. తాను నివసించే బజారు పట్ల భావోద్వేగంతో ఉంటారు. ఊరు కాస్తా జిల్లాగా మారినప్పుడు ఊరు భావోద్వేగం వెంటాడుతుంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు జిల్లా భావోద్వేగం ఉంటుంది. సో.. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా.. ఇప్పటిదాకా తాము అమితంగా ప్రేమించే జిల్లా నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి కోట్ల మందికి రావొచ్చు. ఈ మార్పు కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. ఇంతకాలం తాము ఫలానా జిల్లా అని ఫీలైన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా తమ జిల్లాను మార్చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త జిల్లాల కారణంగా.. ఇప్పటివరకూ ఒకే జిల్లాలో సంబంధాలు కలుపుకున్న వారంతా.. దసరా తర్వాత నుంచి వేర్వేరు జిల్లాల వారిగా అయిపోతుంటారు. ఈ అనుభవం కూడా కొత్తగానే ఉంటుందని చెప్పొచ్చు. గతంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లా అంటే దూరం కాస్త ఎక్కువగా ఉండేది. కానీ.. కొత్త జిల్లాల కారణంగా ప్రతి జిల్లా దాదాపు వంద కిలోమీటర్లకు మించి ఉండదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ వంద కిలో మీటర్లకు మించి ఉన్నా.. ఇప్పటి మాదిరి వందల కిలోమీటర్ల విస్తీర్ణం అయితే ఉండదనటంలో సందేహం లేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాము ఒక జిల్లాగా ఏర్పాటు కావాలన్న భావోద్వేగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కొన్ని ఈసారికి జిల్లాలుగా అవతరించని పరిస్థితి. పది జిల్లాలు కాస్తా 27 జిల్లాలుగా అవతరిస్తున్న వేళలోనే.. కొత్త జిల్లాగా మారని వారు.. ఇక భవిష్యత్తులో కొత్త జిల్లాగా మారే అవకాశం దాదాపుగా ఉండదనే చెప్పాలి. అదే జరిగితే.. తాము కోరుకున్న జిల్లా ఏర్పాటు కాకపోవటమన్న అసంతృప్తి లక్షలాది మందిని వెంటాడుతుందనటంలో సందేహం లేదు. ఏమైనా.. కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్సాహం ఒకపక్క.. అందుకు భిన్నమైన ఉండే వాస్తవ పరిస్థితుల్ని ప్రజలు ఎంత త్వరగా జీర్ణించుకుంటారన్నది కాలమే డిసైడ్ చేయాలి.