కరోనా వైరస్ పేరువింటేనే ఇప్పుడు అందరూ భయంతో వణికిపోతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 12 లక్షలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కరోనా అనే పేరు విన్నా, కరోనా వారికి వచ్చింది అని తెలిసినా కూడా వణికిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా కేసుల్ని అదుపులోకి తీసుకురాలేకపోతుంది. దీనితో రోజురోజుకి క్వారంటైన్ సెంటర్స్ , ఐసోలేషన్ కేంద్రాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ..
ఐసోలేషన్ కేంద్రంలో తమకు కనీస సదుపాయాలు , తాగునీరు , మంచి ఆహారం కూడా పెట్టడం లేదని కరోనా బాధితులు రోడ్డుమీదకు వచ్చి ధర్నాకి దిగారు. ఈ ఘటన చెన్నలోని మంకాడు ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలో బయట చోటుచేసుకుంది. ఐసోలేషన్ లో ఉన్న మాకు సరైన చికిత్స కూడా అందించడం లేదంటూ కరోనా భాధితులందరూ కలిసి రోడ్డు పైకి వచ్చి ధర్నాకి దిగారు. అయితే, కరోనా బాధితులు ఇలా ఒక్కసారిగా బయటకి వచ్చి ధర్నా చేస్తున్నారు అని తెలుసుకున్న స్థానికులు కరోనా భయంతో అక్కడి నుండి దూరంగా పారిపోయారు. దీనితో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి కరోనా బాధితులకు సర్ది చెప్పారు. దీంతో ఆందోళన విరమించి మళ్లీ క్వారంటైన్ సెంటర్ లోకి వెళ్లారు కరోనా పేషెంట్లు.
ఇకపోతే, తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రోజు రోజుకీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే, దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం రెండొవ స్థానంలో ఉంది. తమిళనాడు లో మొత్తం ఇప్పటివరకు 1,92,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇప్పటి వరకూ 3,232 మంది మరణించారు.