తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు సెగ దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. ఈమేరకు ఇవాళ పలువురు తమిళనాడుకు చెందిన విద్యార్థులు - యువకులు ఢిల్లీలోని తమిళనాడు హౌజ్ ఎదుట ఆందోళన చేపట్టారు. జల్లికట్టు క్రీడపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంప్రదాయ జల్లికట్టు క్రీడపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరినా బీచ్ లో తమిళనాడుకు చెందిన యువకులు - విద్యార్థులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా...తమిళనాడులో జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని జరుగుతోన్న ఆందోళనపై నటుడు విశాల్ స్పందించారు. ఇది ఆందోళన కాదని - విప్లవమని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. తాము చేస్తోన్న విప్లవ నినాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలని తెలిపారు. జల్లికట్టును జంతు హింసగా పరిగణించరాదని విశాల్ కోరారు. జల్లికట్టు ద్వారా జంతువుల ప్రాధాన్యతను కూడా చెప్పొచ్చని వివరించారు. కాగా, జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ చేయాలని చెన్నైలోని మెరినా బీచ్ లో జరుగుతోన్న ఆందోళనకు తమిళనటులే కాదు విదేశాల్లో ఉన్న తమిళ యువకులు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈమేరకు మెరినా బీచ్ కు చేరుకుని ఆందోళనలో భాగస్వాములవుతున్నారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం కలిసిన అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం జల్లికట్టుపై స్పందించింది. జల్లికట్లు అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపింది. ఈ విషయంపై తమిళనాడు సీఎం సూచనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సావధానం - సానుకూలంగా విన్నారని వివరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/