బీజేపీలోకి పీటీ ఉష.. కేరళపై కమలదళం నజర్

Update: 2021-02-22 11:30 GMT
దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడుతోపాటు కేరళపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ మెట్రో రూపశిల్పి 'శ్రీధరన్'ను బీజేపీలో చేర్చుకున్న కమలదళం ఇప్పుడు అక్కడ ప్రముఖులను కూడా వరుసగా చేర్చుకుంటోంది.

ఒలింపిక్ పతక విజేత, మాజీ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష తాజాగా బీజేపీలో చేరి సంచలనం సృష్టించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు ఇటీవల ఆమె మద్దతు తెలిపారు. అంతర్జాతీయ సెలెబ్రెటీల వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలోనే బీజేపీ ఆహ్వానం మేరకు పీటీ ఉష ఆ పార్టీలో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.

ఇక శ్రీధరన్, పీటీ ఉషతోపాటు ప్రముఖ మాలీవుడ్ నటుడు ముకుందన్ కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకపోయినప్పటికీ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సినీ నటీమణులు అనుశ్రీ, మల్లికా సుకుమారన్ లను కూడా బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
Tags:    

Similar News