లేస్తే మనిషిని కాను అని వెనకటికి ఒకడు పదే పదే అంటూ వచ్చాడు. తీరా లేపితే ఏమీ చేయలేక చేతులెత్తేశాదు. ఈ సామెత ఇప్పటికీ అందరి నోళ్ళలో నానుతూనే ఉంటుంది. అంటే కేవలం మాటలే తప్ప చేతలు ఉండవని దీని భావం. ఇపుడు వైసీపీ నేతలు తీరు కూడా అలాగే ఉంది. చంద్రబాబు వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధి. ఆయనతో రాజకీయ వైరం ఉంది. ఇక చంద్రబాబుని ఓడించాలని చెబితే 2019 ఎన్నికల్లో జనాలు టీడీపీని చిత్తుగా ఓడించారు.
అక్కడితో జనం తీర్పు ముగిసింది. వైసీపీ రాజ్యం వచ్చిందిపుడు. మూడేళ్ళుగా జగన్ ఏలుబడి సాగుతోంది. ఇంకా కూడా చంద్రబాబునే టార్గెట్ చేసుకుని నిత్యం ఆయన మీద నిందలేస్తే జనాలకు తెగ చిరాకు పుడుతుంది కదా. అయినా ప్రజా కోర్టులో శిక్ష పడిన బాబుని మళ్లీ మళ్ళీ శిక్షించాలనుకోవడం కంటే అతి ఎక్కడైనా ఉంటుందా. కానీ చేసిన తప్పునే తిరిగి వైసీపీ చేస్తోంది.
అలా చంద్రబాబు మీద తన అక్కసుని చాటుకుంటోంది అని అంటున్నారు. విషయానికి వస్తే డేటా చోరీ వివాదంలో చంద్రబాబు పాత్ర ఆయన కొడుకు అప్పటి ఐటీ మంత్రి లోకేష్ పాత్ర ఉందని ఆధారాలు ఉన్నాయని దాని మీద అసెంబ్లీ నియమించిన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అంటున్నారు. ఈ విషయంలో అన్నీ పరిశీలించాక లోతైన విచారణ జరిగాక తమకు కీలకమైన ఆధారాలు లభించాయని ఆయన చెబుతున్నారు.
వాటికి అసెంబ్లీకి ముఖ్యమంత్రికి తెలియచేస్తామని నివేదిక ఇస్తామని ఆయన చెబుతున్నారు. ఆయన చెప్పిందే నిజం అనుకుంటే సభా సంఘం ఇచ్చిన నివేదిక మీద అసెంబ్లీ చర్చిస్తుంది, ఆ మీదట చంద్రబాబుని ఏం చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న. డేటా చోరీలో చంద్రబాబు ఆయన కుమారుడు దోషులు అని ఆయన అంటున్నారు. ఇక దీని మీద పోలీసులు కూడా లోతైన విచారణ చేపడతారు అని చెబుతున్నారు.
అంతా బాగానే ఉన్నా కూడా అసెంబ్లీ చంద్రబాబుని ఏమి చేస్తుంది, ఏ విధంగా శిక్షిస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. దీని మీద నోటీసులు కనుక జారీ చేస్తే కనుక బాబు మాత్రం తక్కువ తింటారా. తాను ఎలా చేయాలో ఏమి చేయాలో ఆయనకు కూడా బాగా తెలుసు. ఇక దీనికంటే ముందు రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ఏకంగా మంత్రుల కమిటీ తేల్చి బాబు మీద యాక్షన్ కి దిగాలనుకుంటే ఆయన కోర్టుకు వెళ్లారు.
ఇక కోర్టులో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నది జరగనే లేదని తేలిపోయింది. దాంతో బాబు హ్యాపీగా బయటపడితే వైసీపీకి అది బూమరాంగ్ అయింది. ఇపుడు డేటా చోరీ మీద కూడా వైసీపీ మరోమారు అతి ఉత్సహాం ప్రదర్శిస్తోందా అన్న చర్చ అయితే ఉంది. బాబు మీద విమర్శలు చేసి ఆయన హయాంలో డేటా చోరీ చేసి ప్రజల వద్ద ఉండాల్సిన గోప్యతను భంగం కల్పించారు అని ఆరోపించినంతమాత్రాన సరిపోదుగా. యాక్షన్ కావాలి. కానీ ఈ విషయంలో కూడా బాబుని ఏమీ చేయలేరని జనాలలో ఉన్న టాక్.
అసలు మూడేళ్ల వైసీపీ ఏలుబడిలో బాబు మీద చేసిన ఒక్క ఆరోపణ కూడా వైసీపీ పెద్దలు రుజువు చేయలేకపోయారు అని టీడీపీ వారే కాదు జనాలే అంటున్నారు. అందువల్ల ఇవన్నీ వ్యర్ధ ప్రయత్నాలుగా కూడా కొట్టి పారేస్తున్నారు. డేటా చోరీ జరిగింది. మమ్మల్ని ఆనాడు టీడీపీ సర్కార్ పెద్దలు టార్గెట్ చేశారు అంటూ భూమన వంటి వారు ఇస్తున్న స్టేట్మెంట్స్ లో సంచలనాలు అయితే జనాలకు కనిపించడంలేదు అన్నదే లేటెస్ట్ మాట. సో బాబు ని వైసీపీ తన మిగిలిన పదవీ కాలంలో కూడా ఏమీ చేయలేదా అంటే చేయలేదు అనే జనాలు అంటున్నారు. సో తమ్ముళ్ళూ ఫుల్ హ్యాపీస్ గా ఉండండి అంతే.