పెట్రోల్ పోయని సిబ్బంది.. బస్సులో ప్రయాణించిన మంత్రి

Update: 2020-01-04 07:57 GMT
అధికారం ఉంది.. ప్రభుత్వ సదుపాయాలు ఉన్నాయి.. ఇంకే దర్జాగా రాజభోగాలు అనుభవించవచ్చని ఆ మంత్రి కలలుగన్నాడు. కానీ అక్కడే ట్విస్ట్ నెలకొంది. ఆ రాజభోగాల ఖర్చులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాపం బస్సు ఎక్కి ప్రయానించాల్సిన దుస్థితి ఆ మంత్రికి పట్టింది.

పాండిచ్చేరి మంత్రి ఆర్. కమలా కణ్ణన్ కు ఊహించని షాక్ తగిలింది. శనివారం ఉదయం మంత్రి కారు స్థానిక కోఆపరేటివ్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చింది. పెట్రోల్ పోయమని సిబ్బందిని ఆదేశించగా వారు నిరాకరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చాలా పెండింగ్ లో ఉన్నాయని.. అవి చెల్లించే వరకూ మంత్రులకు పెట్రోల్ పోయమని బంక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ హఠాత్ పరిణామం తో షాక్ అయిన మంత్రి చేసేదేం లేక ఆర్టీసీ బస్సు ఎక్కి మీటింగ్ కు వెళ్లి పోయారు. ఇలా మంత్రికే పెట్రోల్ పోయకుండా నిరసన తెలిపిన పెట్రోల్ బంక్ యాజమాన్యం తీరు వైరల్ గా మారింది.
Tags:    

Similar News