ఐపీఎస్ అధికారిణిగా ఎంత పవర్ ఫుల్ అనిపించుకున్నారో... బ్యూరోక్రాట్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత కిరణ్ బేడీ అంతగా తేలిపోయారని చెప్పాలి. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా రికార్డులకెక్కిన కిరణ్ బేడీ... విధి నిర్వహణలో పురుష పుంగవులకు ఏమాత్రం తీసిపోని విధంగా... పురుష అధికారుల కంటే కూడా మెరుగ్గా రాణించి సత్తా కలిగిన పోలీసు ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. వృత్తి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ బేడీ... నేరస్తులకు సింహస్వప్నంలానే మారిపోయారు. ఇక వృత్తి జీవితం చివరి దశలో చాలా కాలం పాటు దేశంలోనే పెద్ద జైలుగా వినుతికెక్కిన తీహార్ జైలు సూపరింటెండెంట్ గా కిరణ్ బేడీ వ్యవహరించిన తీరు... ఆమె కెరీర్ కే హైలెట్ అని చెప్పాలి.
వృత్తి జీవితంలో ఎంతో సంతృప్తితో పదవి విరమణ చేసిన కిరణ్ బేడీ కొంత కాలం పాటు అవినీతి నిర్మూలన ఉద్యమాల్లో చాలా చురుగ్గానే పాలుపంచుకున్నారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఆ తర్వాత బీజేపీ పంచన చేరిపోయిన కిరణ్... మొన్నామధ్య మోదీ దయతో పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్ఛేరి గవర్నర్ గా కిరణ్ బేడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన వేళా విశేషమేమో తెలియదు గానీ... ఆ పదవి చేపట్టిన నాటి నుంచి కూడా ఆమెకు బ్యాడ్ టైమే నడుస్తోందని చెప్పాలి. ప్రస్తుతం పుదుచ్ఛేరి సీఎంగా ఉన్న నారాయణ సామితో కిరణ్ బేడీకి అసలు పొసగడం లేదన్న మాట ఆదిలోనే వినిపించింది. అయితే అన్ని రాష్ట్రాల్లో మాదిరే పుదుచ్ఛేరిలోనూ గవర్నర్ - సీఎంల మధ్య ఉన్నవి మామూలు విబేధాలే అన్న వాదన వినిపించింది. అయితే అవి మామూలు విబేధాలు కాదు... కిరణ్ బేడీని తీవ్రంగా కలిచివేసే విబేధాలేనని తాజాగా తేలిపోయింది.
ఇటీవల వరుస క్రమంలో చోటుచేసుకుంటున్న పరిణామాల్లో సీఎం నారాయణసామి... గవర్నర్ అధికారాలపై దండెత్తుతున్నారు. అంతేకాకుండా గవర్నర్ హోదాలో బేడీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతున్నారు కూడా. తాజాగా అలాంటి ఓ వివాదమే ఇప్పుడు చోటుచేసుకుంది. ఈ వివాదంలో నారాయణ సామి కొట్టిన దెబ్బ... ఒక్క కిరణ్ బేడీనే కాకుండా బేడీని గవర్నర్‌గా నియమించిన మోదీ సర్కారుకు కూడా కాస్తంత గట్టిగానే తగిలిందన్న వాదన వినిపిస్తోంది. అసలు ఈ తాజా ఘటన ఏమిటన్న విషయానికి వస్తే... నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా కిరణ్ బేడీ ప్రమాణస్వీకారం చేయించిన ముగ్గురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని పుదుచ్ఛేరి అసెంబ్లీ కార్యదర్శి తేల్చారు. ఇందులో కిరణ్ ఎంపిక చేసిందేమీ కూడా లేదనే చెప్పాలి. కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతోనే బేడీ పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించారు. వారి పదవులు ఇప్పుడు చెల్లవంటూ అసెంబ్లీ కార్యదర్శి తేల్చి పారేశారు. ఈ ఒక్క నిర్ణయంతో ఇటు బేడీతో పాటు అటు మోదీ సర్కారుకు నారాయణ సామి గట్టి షాకే ఇచ్చారు. దీనిపై ఇటు బేడీ, అటు కేంద్రం ఎలా స్పందిస్తాయోనన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.