టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న పుల్లెల గోపీచంద్

Update: 2021-07-07 13:30 GMT
గత రెండు ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించడంలో దేశానికి మార్గనిర్ధేశం చేసిన భారత బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపీచంద్ తాజాగా రాబోయే టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడం సంచలనమైంది. సింగిల్స్ షట్లర్ బి.సాయి ప్రణీత్ శిక్షకుడైన ఇండినోషియా కు చెందిన అగస్ డ్వి సాంటోసాకు అవకాశం కల్పించడానికి గోపీచంద్ భారత ఒలంపిక్ బృందం నుంచి తప్పుకున్నాడు.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)  ఐదుగురు సభ్యుల సహాయక సిబ్బందిని మాత్రమే పంపాలని నిర్ణయించింది. ఇందులో ముగ్గురు కోచ్ లు, ఇద్దరు ఫిజియోలు ఉన్నారు. ఈసారి పీవీ సింధు కోరియా కోచ్ తాయ్ సాంగ్ పార్క్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ప్రదీణ్ ఏమో సాంటోసా ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు.  చిరాగ్, సాత్విక్ లకు డెన్మార్క్ కోచ్ మాథియాస్ బో సలహాదారుడిగా ఉన్నారు. ఈ నలుగురు షట్లర్లు ఒలింపిక్స్ ఎడిషన్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిబంధనల ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ ఉండడంతో గోపీచంద్ తనకు తానుగా తప్పుకున్నాడు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రధానకార్యదర్శి అజయ్ సింఘానియా దీనిపై మాట్లాడారు. ‘కేవలం ఒక కోటా అందుబాటులో ఉన్న సాయి ప్రణీత్ తో శిక్షణ పొందుతున్న సోతోసోకు వసతి కల్పించేలా గోపీచంద్ వైదొలగాలని నిర్ణయించుకున్నారని.. కోవిడ్ కఠిన నిబందనల వల్లే ఈసారి ఎక్కువ మందిని ’ పంపలేకపోతున్నామని తెలిపారు.

అయితే భారత షట్లర్స్ ముఖ్యంగా తమ సొంత కోచ్ లు తమతో రావాలని వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గోపీచంద్ ను కోరుకోవడం లేదని తెలిపింది. అందుకే గోపీచంద్ కూడా ఇక తాను వెళ్లకూడాదనినిర్ణయించుకున్నాడు. భారత బ్యాడ్మింటన్ బృందం తుది జాబితాలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు ఆటగాళ్లు కాగా.. ముగ్గురు కోచ్ లు.. ఇద్దరు ఫిజియోలు  టోక్యో ఒలింపిక్స్ వెళుతున్నారు.

కోవిడ్ ప్రొటోకాల్స్ కారణంగా సహాయ సిబ్బందికి 33శాతం కోటాను మాత్రమే అనుమతించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఒలింపిక్స్ కు ప్రయాణించే అధికారులు అథ్లెట్స్ లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండకూడదని రూల్ పెట్టారు. దీంతో కోవిడ్ నిబంధనల కారణంగా గోపీచంద్ ఈసారి వైదొలిగారు.

గోపీచంద్ మార్గదర్శకత్వంలోనే సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుపొందింది. పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించింది.
Tags:    

Similar News