వీరూకు సెల్యూట్ కొట్టాల్సిందే

Update: 2019-02-17 07:21 GMT
పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన భారత వీర జవాన్ల కుటుంబాల్ని ఆదుకునే విషయంలో దేశమంతా ఉదారంగా స్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సామాన్య జనాలు పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుస్తున్నారు. తమ వంతుగా బాధిత కుటుంబాల్ని ఆదుకునేందుకు ముందు వస్తున్నారు. సెలబ్రెటీలు సైతం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే కొందరు పెద్ద సాయాలకు ముందుకు వస్తున్నారు. అందులో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. ఉగ్ర దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు నివాళిగా వారి పిల్లల్ని ఉచితంగా చదివించడానికి ముందుకొచ్చాడు సెహ్వాగ్‌. బాధిత కుటుంబాల్లోని అందరు పిల్లల చదువు బాధ్యతను పూర్తిగా తాను తీసుకుంటానని వీరూ ప్రకటించాడు.

క్రికెట్ నుంచి రిటైరవ్వడానికి ముందే సెహ్వాగ్ ఢిల్లీకి దగ్గర్లో తన పేరుతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేశాడు. ఈ పాఠశాల తక్కువ కాలంలో మంచి ఆదరణ దక్కించుకుంది. గురువారం జరిగిన ఈ దాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జవాన్ల కుటుంబాల్లో ఎంతమంది పిిల్లలు ఉంటే అంతమంది బాధ్యతా తాను తీసుకుని.. తన స్కూల్లో పాఠశాల విద్య పూర్తి ఉచితంగా అందిస్తానని సెహ్వాల్ చెప్పాడు. సెహ్వాగ్ సహచరుడైన గౌతమ్ గంభీర్ సైతం ఇలాంటి ప్రతిపాదనే చేశాడు. మరోవైపు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. వీర జవాన్ల కుటుంబాలకు తన వంతుగా రూ.25 లక్షల విరాళం ప్రకటించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫుున రూ.5 లక్షల విరాళం అందించించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రెటీల్లో విజయ్ దేవరకొండ వెంటనే స్పందించి విరాళం ప్రకటిస్తూ.. అందరూ స్పందించి జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాంటూ మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News