పోలీస్ పవర్ ఎంతన్నది కొంతమంది అధికారుల్ని చూస్తే కానీ తెలీదు. బాధ్యతగా వ్యవహరిస్తూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే వారి చేతుల్లో ఎంత అధికారం ఉన్నా.. అదేమిటన్నది అర్థం కానట్లు ఉంటుంది. కానీ.. చేతిలో ఉన్న పవర్ ను ఇష్టారాజ్యమన్నట్లు వ్యవహరిస్తూ తమకు తోచింది చేసే కొందరుఅధికారుల్ని చూసినప్పుడు పోలీస్ పవర్ ఇంతలా ఉంటుందా? అన్న భావన కలుగక మానదు.
తాజాగా చూస్తే.. ఒక కేసులో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కు వరుసకు మనమడు అయ్యే పెద్దమనిషిని ఫూణె పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై మోపిన అభియోగం ఏమిటో తెలుసా? మావోలతో సంబంధాలు ఉన్నాయని.. ఆయన చేసిన ఉద్రేకపూరిత ప్రసంగం కారణంగా కొరేగావ్ భీమా యుద్ధ స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లుగా ఫూణె పోలీసులు చెబుతున్నారు.
అంబేడ్కర్ మనమడు ప్రొఫెసర్ ఆనంద్ తెల్ తుంబ్డే అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీరితో పాటు.. ఫూణె అదనపు సెషన్స్ జడ్జికిశోర్ వదానే పోలీసుల తీరును తప్పు పట్టారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా పెద్ద డ్రామానే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసుల అత్యుత్సాహానికి కోర్టు బ్రేకులు వేసిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
అంబేడ్కర్ మనమడ్ని శనివారం ముంబయి విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేయటం కలకలాన్ని రేపింది. దీనిపై స్పందించిన జడ్జి.. తెల్ తుంబ్డేను ఫిబ్రవరి 11 వరకూ అరెస్ట్ చేయకుండా సుప్రీం ఆదేశాలు ఉన్న విషయాన్ని చూపించి.. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని సెషన్స్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాఉంటే.. ఆయన అరెస్ట్ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు వాదిస్తుండటం గమనార్హం.